BigTV English

thub: అంతరిక్షంలో తెలంగాణ సంతకం.. నింగిలోకి టిహబ్ ఉపగ్రహం..

thub: అంతరిక్షంలో తెలంగాణ సంతకం.. నింగిలోకి టిహబ్ ఉపగ్రహం..

thub: శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి అంతరిక్షంలోకి రెండు నానో ఉపగ్రహాలు దూసుకెళ్లాయి. ప్రయోగం సక్సెస్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ప్రధాని మోదీ సైతం అభినందించారు. ఇస్రోకు చెందిన పీఎస్‌ఎల్వీసీ-54తో పాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ధృవ’ సంస్థ పంపిన ‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’ ఉపగ్రహాలు వాటి కక్ష్యల్లోకి చేరాయి.


టీహబ్‌లో సభ్య సంస్థ ‘స్కైరూట్’ ఇటీవల ప్రయోగించిన విక్రమ్-ఎస్ ఉపగ్రహ ప్రయోగం సైతం విజయవంతం కావడం… తాజాగా మరో రెండు శాటిలైట్స్ నింగికేగడం.. తద్వారా దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్‌ మొట్ట మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందన్నారు సీఎం కేసీఆర్. దేశ అంకుర సంస్థల చరిత్రలో ఇదో శుభదినమన్నారు. టీహబ్‌లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయనే నమ్మకం ఉందని.. ఇది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ మరియు ‘ధృవ’ స్పేస్ స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక, ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను అభినందించారు సీఎం కేసీఆర్.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×