E-Paper
Advertisement

Tiger Movement: హమ్మయ్యా.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెల్లిని పెద్దపులి..?

Tiger Movement: హమ్మయ్యా.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెల్లిని పెద్దపులి..?

Tiger Movement: స్వేచ్ఛ బ్యూరో: పులి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్లేందుకు తిరుగు ముఖం పట్టింది. వచ్చిన దారిలోనే 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. సుమారు మూడు నెలలకు పైగా అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. అయితే తిరుగు ముఖం పట్టడంతో ప్రజలతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లయింది.

ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో..

మహారాష్ట్ర నుంచి వలసొచ్చి వచ్చిన దారిలోనే వెనక్కి పయనిస్తోంది. మూడు నెలలకు పైగా దాదాపు 11 జిల్లాల్లో ఇటు ఆఫీసర్లను, అటు ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి తిరుగుబాట పట్టింది. కొత్త ఆవాసం కోసం, తోడు కోసం అన్వేషిస్తూ వచ్చిన ఈ పులి ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి సొంత గూటికి పయనమైంది. నిన్నా.. మొన్నటి వరకు సిరిసిల్ల, జగిత్యాలలో సంచరించిన ఈ బెబ్బులి తాజాగా నిజామాబాద్​ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కమ్మర్​పల్లి పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో సేదతీరినట్లు కెమెరా ట్రాప్​కు చిక్కింది. నాలుగురోజుల క్రితం ఇక్కడికి వచ్చిన పులి ఓ వన్యప్రాణిని చంపి తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్​ ఆఫీసర్లు డ్రోన్​ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. పులి కదలికలను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ కిన్వట్ ప్రాంతం తన సొంత సామ్రాజ్యానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫారెస్ట్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వచ్చిన తొవ్వకు సమాంతరంగా 10 నుంచి 15 కిలో మీటర్ల దూరంలో వేగంగా కదులుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో పశువులను హతమార్చిన పులి.. మనుషులకు ఎలాంటి హాని తలపెట్టలేదు.

అధికారులు అంచనా..

దక్షిణ దిశగా ప్రయాణించిన పులి తాజాగా ఉత్తర వైపు కదులుతోంది. తెలంగాణలోకి వచ్చినప్పుడు ఏ రూట్‌లో అయితే ప్రయాణించిందో.. ఇప్పుడు సరిగ్గా అదే రూట్‌కు సమాంతరంగా కేవలం 20 కిలోమీటర్ల దూరంతో వెనక్కి వెళ్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల గుండా ఉత్తర దిశగా మహారాష్ట్ర వైపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే తిరిగి కవ్వాల్ టైగర్ రిజర్వ్ లేదా పెన్‌గంగా నది దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పులి వెనక్కి వెళ్తుండటంతో అటవీశాఖ అధికారులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also Read: AC vs Windows: కారు విండోస్ ఓపెన్ చేసి కారు నడిపితే తక్కువ పెట్రోల్ ఖర్చవుతుందా? ఏసీతో నడిపితేనా?

రాష్ట్ర చరిత్రలోనే..

గతేడాది నవంబర్, డిసెంబర్ నెలలో మహారాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణలోకి ప్రవేశించిన ఈ పులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మీదుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్​,సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి ఇలా 11 జిల్లాల్లో సంచరించింది. రాష్ట్ర చరిత్రలోనే ఒక పులి ఇంత సుదీర్ఘంగా ఇన్ని జిల్లాల్లో సంచరించడం ఇదే తొలిసారి అని ఆఫీసర్లు అంటున్నారు. పులి సంచారంతో ఆయా జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆకలి వేసినప్పుడల్లా దారిలో కనిపించిన లేగ దూడలు, ఆవులను చంపుకుంటూ వెళ్లింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడ్డారు. పులి ఎటు వెళ్తుందో తెలియక అటవీశాఖ అధికారులు వందల కిలోమీటర్లు దాని నిఘా పెట్టారు. దాని అడుగుజాడలు కోసం అణువణువు గాలించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ ట్రాప్‌లు, బోనులు ఏర్పాటు చేసినా.. అది మాత్రం చిక్కకుండా అధికారులకు చుక్కలు చూపించింది. ఎప్పటికప్పుడు లొకేషన్ మారుస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసింది.

సీసీ కెమెరాలతో నిఘా..

పులి జాడను కనుగొనేందుకు ప్రత్యేక టీమ్ సైతం అటవీశాఖ ఏర్పాటు చేసింది. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసింది. అది ఎక్కడెక్కడ తిరుగుతుంది అని తెలుసుకొని ఆయా ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. చివరకు పులి మహారాష్ట్ర కు తిరుగు ప్రయాణం రావడంతో అధికారులు ఊపిరి గెలుచుకున్నారు.

Also Read: MP Eatala Rajender: సంక్షేమ పథకాలు ఎక్కువిస్తున్నారంటే బలహీనతే: ఎంపీ ఈటల రాజేందర్

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×