E-Paper
Advertisement

Uttam Kumar Reddy: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. పదేళ్లు సీఎంగా ఏం చేశారు.. కేసీఆర్ కు ఉత్తమ్ కౌంటర్

Uttam Kumar Reddy: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. పదేళ్లు సీఎంగా ఏం చేశారు.. కేసీఆర్ కు ఉత్తమ్ కౌంటర్
Advertisement

Uttam Kumar Reddy: కాళేశ్వరం కూలిపోవడానికి కారణమే కేసీఆర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి, ఆ భారాన్ని మనపై మోపి నామమాత్రపు ఆయకట్టు తీసుకొచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీం జడ్జి సైతం తప్పుబట్టారన్నారు.

పదేళ్లు సీఎంగా ఏం చేశారు

పదేళ్ల పాటు సీఎందగా ఉన్న కేసీఆర్‌ పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు, దిండి,ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అవాస్తవాలు మాడ్లాడడం పదేళ్లు సీఎంగా చేసిన పనిచేసిన కేసీఆర్‌కు తగదన్నారు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి, ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారన్నారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

Advertisement

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో సమర్థంగా ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల వాటాలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందున్న పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణను అప్పుల్లో ముంచిన కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం లాంటి కూలిపోయిన బ్యారేజీలు కట్టి ఇరిగేషన్‌ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం కాళేశ్వరం అంచనాలు పెంచారని మంత్రి ఉత్తమ్‌ విమర్శలు చేశారు.

Also Read: KCR: చంద్రబాబు మాట వినే.. కేంద్రం అలా చేసింది.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

Advertisement

నీటి పారుదల శాఖను నాశనం చేసింది కేసీఆర్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారని, అలాంటిది ఎందుకు కూలిపోయిందని ప్రశ్నించారు. రూ.1. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు వల్ల రైతులకు ఏం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్‌ గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రూ.38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు ఎందుకు వెచ్చించారని ప్రశ్నించారు. రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×