E-Paper
Advertisement

నోరూరించే దోసకాయ టమాటో పచ్చడి..రోట్లో నూరితే అమృతమే!

నోరూరించే దోసకాయ టమాటో పచ్చడి..రోట్లో నూరితే అమృతమే!
Advertisement

Dosakaya tomato roti pachadi: మన తెలుగు వారి భోజనంలో.. పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. మిక్సీలో చేసిన పచ్చడి కంటే..రోట్లో లేదా రోకలి బండతో నూరిన పచ్చడికి ఉండే రుచే వేరు. అమ్మమ్మల కాలం నాటి పద్ధతిని గుర్తు చేస్తూ తయారు చేసే ‘దోసకాయ టమాటో రోటి పచ్చడి’ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. దోసకాయ పుల్లపుల్లగా, టమాటో జ్యూసీగా, పచ్చి మిర్చి కారంతో.. కలిసి రోట్లో నూరుతుంటే.. వచ్చే సువాసనే వేరు. మరి ఈ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

దోసకాయ – 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)

Advertisement

టమాటోలు – 2 (మధ్యతరహా సైజు,ముక్కలుగా కోసినవి)

పచ్చిమిర్చి – 6 నుంచి 8 (కారానికి తగినట్లు)

Advertisement

చింతపల్లి లేదా చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు అంత

వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 7

జీలకర్ర – 1 స్పూన్

నూనె – 2 స్పూన్లు

కొత్తిమీర తరుగు – గుప్పెడు

ఉప్పు – రుచికి సరిపడా

తాలింపు కోసం:ఆవాలు,మినపప్పు,కరివేపాకు,ఎండుమిర్చి,చిటికెడు ఇంగువ.

తయారీ విధానం:

1.ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చి మిర్చి చీలికలు వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చి మిర్చి బాగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో.. తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, చింతపండు వేసి, టమాటోలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు మగ్గనివ్వాలి.టమాటోల్లోని నీరంతా ఇనికిపోయి గుజ్జుగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి.

2. ఇప్పుడు అసలైన.. మ్యాజిక్ ప్రారంభమవుతుంది. ఒక శుభ్రమైన రోలు తీసుకుని, అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరో సారి దంచాలి.

3.పచ్చి మిర్చి నలిగిన తర్వాత..ఉడికించి చల్లార బెట్టిన టమాటో గుజ్జును రోట్లో వేసి మెత్తగా నూరాలి. ఇప్పుడు ఇందులో.. ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, తాజా కొత్తిమీర తరుగు వేయాలి.దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకూడదు. కేవలం మసాలాతో.. కలిసేలా కచ్చా పచ్చాగా దంచాలి. అప్పుడే తింటుంటే.. దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ అద్భుతమైన రుచినిస్తాయి.

4. పచ్చడి తయారైన తర్వాత ఒక చిన్న గిన్నెలో.. నూనె వేడి చేసి,ఆవాలు,మినపప్పు,కరి వేపాకు,ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఈ గుమగుమలాడే తాలింపును రోటిపచ్చడిలో కలిపి బాగా మిక్స్ చేయాలి. అంతే.. అమ్ములు చేసిన కమ్మనైన దోసకాయ టమాటో రోటిపచ్చడి రెడీ!

Also Read: నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

ఈ పచ్చడి ప్రత్యేకతలు:

ఈ పచ్చడిని మిక్సీలో.. పట్టకుండా రోట్లో నూరడం వల్ల కూరగాయల సహజమైన రుచి అలాగే ఉంటుంది.

వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే.. అమృతంలా ఉంటుంది.ఇది ఇడ్లీ, దోసెల్లోకి కూడా అదిరిపోతుంది.

ఎలాంటి క్లిష్టమైన పదార్థాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే.. ఎంతో రుచికరంగా ఈ దోసకాయ టమాటో రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఈ సారి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి.

Related News

బీరకాయ కోడిగుడ్డు కూర..అన్నం,చపాతీలోకి అద్భుతమైన కాంబినేషన్!

స్ట్రీట్ స్టైల్ ముంతమసాలా..ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేయండి!

ఇల్లు చిన్నదైనా పండుగ కళ రావాల్సిందే.. 1BHKలో దీపావళి డెకరేషన్ కోసం సింపుల్ టిప్స్

రోజూ వాకింగ్ చేస్తున్నారా? మీ నడకలో ఈ ఒక్క అలవాటు మార్చుకోవాలి

మేకప్ తొలగించడానికి ఖరీదైన రిమూవర్లు అవసరం లేదు.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి

వంగినప్పుడు లేదా కొంచెం బరువు ఎత్తగానే వెన్నునొప్పి వస్తోందా? దీనికి కారణాలు ఇవే

హైదరాబాద్ స్టైల్ దమ్ కా కీమా..ఇలా చేస్తే రుచి అద్భుతం!

Big Stories

Advertisement
×