Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ సిరాజ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ సమం కావడంలో సిరాజ్ పాత్ర కీలకం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతోనే కాకుండా.. మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ప్రముఖ గాయని ఆశా బోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో కలిసి రాఖీ పండుగ వేడుకను జరుపుకున్నాడు. ఈ వేడుక కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సిరాజ్, జనాయ్ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వదంతులకు తెరదించుతూ తమ మధ్య ఉన్నది అన్నా చెల్లెలు బంధమేనని వారు ఈ రాఖీ పండుగతో స్పష్టం చేశారు.
Also Read : Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?
సిరాజ్ కి రాఖీ కట్టిన జనాయ్ భోస్లే
జనాయ్ ఆప్యాయంగా సిరాజ్ కి రాఖీ కడుతున్న వీడియో ను సిరాజ్ తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ కి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. సహచర క్రికెటర్ రిషబ్ పంత్ కూడా లవ్ ఎమోజీ తో స్పందించి తన శుభాకాంక్షలను వెల్లడించాడు. ఇటీవలముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. మొత్తం 23 వికెట్లు పడగొట్టి.. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టులకే పరిమితమైన నేపథ్యంలో సిరాజ్ భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. అతని నిలకడైన ప్రదర్శనతో భారత్ సిరీస్ ను 2-’ తో డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్.
సిరాజ్ పై ప్రశంసలు
మరోవైపు మహ్మద్ సిరాజ్ పై పాక్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరాజ్ ఇక సపోర్ట్ బౌలర్ కాదని.. ప్రధాన పేసర్ అని అక్రమ్ కొనియాడారు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్ లో సిరాజ్ అద్భుతం చేశాడు. రెండు ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్ కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తద్వారా 5 మ్యాచ్ ల సిరీస్ ను 2-2తో భారత్ సమం చేసింది. ఓవరాల్ గా ఈ సీరీస్ లో సిరాజ్ 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అంతేకాదు.. ఈ సిరీస్ లో మొత్తం 1113 బంతులు బౌలింగ్ చేసి తన ఫిట్ నెస్ ఏమిటో చూపించాడు. సిరాజ్ కి తపన, పట్టుదల చాలా ఎక్కువ. అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐదు టెస్టుల్లో దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసి.. చివరిరోజు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నిజంగా గ్రేట్.. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నాడు. సిరాజ్ సపోర్ట్ బౌలర్ కాదు.. బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ ఎటాక్ ని సిరాజ్ లీడ్ చేస్తున్నాడు.
https://www.instagram.com/zanaibhosle/reel/DNIY19ztJeN/