E-Paper
Advertisement

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన 6 శిక్షలు.. ఇది చదివితేనే చెమటలు పట్టేస్తాయ్!

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన 6 శిక్షలు.. ఇది చదివితేనే చెమటలు పట్టేస్తాయ్!
Advertisement

Cruelest Ancient Punishments: నరకంలో శిక్షల గురించి మనం సినిమాల్లో చూసి ఉంటాం. లేదా పుస్తకాల్లో చదివి ఉంటాం. అయితే, నరకంలో కంటే దారుణమైన శిక్షలు భూమిపై అమల్లో ఉండేవంటే మీరు నమ్ముతారా? ఇప్పుడంటే మానవ హక్కులు.. వచ్చాయ్. క్రూరమైన హంతకులకు కూడా క్షమాభిక్ష పెట్టాలని రిక్వెస్ట్ చేసే కాలంలో మనం ఉన్నాం. అయితే, ఒకప్పుడు తప్పు చేస్తే తల తీయడమే అన్నట్లు ఉండేవి పరిస్థితులు. పూర్వం రాజులు, చక్రవర్తులు నేరస్తులను శిక్షించడానికి రకరకాల పద్ధతులు పాటించేవారు. అవేంటో తెలిస్తే.. నరకమే బెటర్ ఏమో అనుకుంటారు. ఇక విషయంలోకి వెళ్లిపోదామా…

మనుషులను మృగాలకు ఆహారంగా వేయడం

రోమన్ సామ్రాజ్యంలో ‘డ్యామ్నాటియో అడ్ బెస్టియాన్’ అనే ఆట ఉండేది. అది ప్రేక్షకులకు మాత్రమే ఆట. నేరస్తులకు మాత్రం పెద్ద శిక్ష. ఇప్పుడంటే మనం ఓటీటీలకు, మూవీ టికెట్లకు డబ్బులు కట్టి మరీ క్రూరమైన సన్నివేశాలున్న సినిమాలు చూస్తున్నాం. కానీ, అప్పట్లో మాత్రం.. క్రూరత్వాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందించేవారు. తప్పు చేసిన వ్యక్తులను క్రూరమైన మృగాలు ఉండే అరేనాలోకి నెట్టేవారు. ఆ జంతువులు వారిని ముక్కలు చేసి తింటుంటే.. దాన్ని ప్రేక్షకులు చూసి ఆనందించేవారు. అది వారికి అప్పట్లో ఒక భయంకరమైన వినోదం. ఇప్పుడంటే.. అలాంటి ఘటనలు జరిగితే.. ఫోన్లలో రికార్డు చేసుకుని, సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అనుకోండి!

‘కింద’ నుంచి బల్లెంను దింపడం

Advertisement

వావ్కాడ్, బ్లాడ్ ది ఇంపేలార్ వంటి రాజులు.. క్రూరత్వానికి చిరునామా. వీరు అమలు చేసే శిక్షలు చాలా దారుణంగా.. శాడిస్టిక్‌గా ఉండేవి. వాటిలో అత్యంత క్రూరమైన శిక్ష.. ‘ఇంపెల్మెంట్’. ఈ శిక్ష ప్రకారం.. నేరస్తుడిని పొడవైన, పదునైన కర్ర బల్లెంపై కూర్చోబెడతారు. దాని షార్ప్ గా ఉండే కొనను వెనుకాల గుచ్చి నిలువుగా కర్రకు కట్టి వదిలేస్తారు. బరువు వల్ల శరీరం క్రమేనా బల్లెంలోకి వెళ్లిపోతుంది. ఆ బల్లెం క్రమక్రమంగా నేరస్తుడి శరీరంలోకి చొచ్చుకుని వెళ్తుంది. ఒక్కో అవయవాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. దీనివల్ల నేరస్తుడు చనిపోయే వరకు నరకయాతన అనుభవిస్తాడు. బ్లాడ్ ది ఇంపేలర్ సుమారు 20 వేల ఒట్టోమన్ సైనికులను ఈ విధంగా శిక్షించాడు. వారిని రాజధానికి వెళ్లే దారి పొడవునా కర్రలకు గుచ్చి నిలబెట్టాడు. దారుణం కదా.

బ్లడ్ ఈగిల్.. ఇదెక్కడి కోతరా నాయనా..

మీరు వైకింగ్స్ (Vikings) గురించి విన్నారా? నెట్ ఫిక్స్‌లో వీరికి సంబంధించి చాలా సీరిస్‌లు ఉంటాయి. అవి చూసినవారికి వారి క్రూరత్వం గురించి తెలిసే ఉంటుంది. కానీ, వారు విధించే ఈ శిక్ష గురించి పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు. ఈ శిక్ష ప్రకారం.. నేరస్తుడిని బోర్లా పడుకోబెట్టి.. వీపు‌లో వెన్నెముకు రెండు వైపులా ఉన్న చర్మాన్ని, కండరాలను కోసి.. పక్కటెముక నుంచి వేరు చేసి బయటకు లాగేవారు. చివరిగా ఊపిరితీత్తులను బయటకు తీసి.. అవి గ్రద్ధ రెక్కల్లా కనిపించేలా పరిచేవారు. ఈ శిక్ష సమయంలో నేరస్తుడు బతికే ఉంటాడు. కానీ, అతడు అనుభవించే శిక్ష ఊహాతీతం. ఇలా ఉన్నారేంటి బ్రో వీళ్లు!

వెయ్యి కోతలు.. చైనాలో వందేళ్లు అమలు

Advertisement

చైనాలో ఎవరినైనా ‘లింగ్ చి’ శిక్ష గురించి చెప్పండని అడిగి చూడండి. వారి బుల్లి కళ్లల్లో పెద్ద భయం కనిపిస్తుంది. లింగ్ చి అంటే.. నెమ్మదిగా కొయ్యడం. వాళ్లు కోసేది కూరగాయలను కాదు.. మనుషులను. తప్పు చేసిన వ్యక్తిని డైరెక్టుగా చంపేస్తే మజా ఉండదనే ఉద్దేశమో ఏంటో.. ఈ శిక్షను ఏకంగా వందేళ్లపాటు అమలు చేశారు చైనీయులు. దీని ప్రకారం.. నేరస్తుడు బతికి ఉండగానే శరీరం నుంచి కండలను ఒక్కొక్కటిగా కోసేవారు. అలా వెయ్యి కోతలతో రోజంతా హింసిస్తూనే ఉంటారు. ఇలా హింసించే బదులు ఒక్కసారే చంపేయండ్రా.. అని అరిచి మొత్తుకున్నా వదలరు. ఎక్కువ గోల చేస్తే నాలుకతో కోత మొదలుపెడతారు. అత్యాచారాలు, క్రూరమైన హత్యలు చేసేవారికి ఇది తగిన శిక్షే అంటారు చైనీయులు. మీరేమంటారు?

బ్రాజెన్ బుల్.. ఇలా చేయాలని ఎలా అనిపించిందో!

బుల్ అంటే ఎద్దు. అయితే.. ఇదేదో ఎద్దుతో కుమ్మించి చంపేసే శిక్ష అనుకుంటే పొరపాటే. ప్రాచీన గ్రీకు కాలంలో ‘బ్రాజెన్ బుల్’ అనే శిక్ష ఒకటి అమల్లో ఉండేది. బ్రాజెన్ బుల్ అంటే.. కాంస్యంతో చేసిన ఎద్దు విగ్రహం. నేరస్తుడిని ఆ విగ్రహంలో పెట్టి.. దాని కింద మంట పెడతారు. వేడి పెరిగే కొద్ది లోపల ఉన్న నేరస్తుడి శరీరం కాలిపోతూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక నేరస్తుడు కేకలు పెడతాడు. ఆ అరుపులు ఎద్దు ముక్కు నుంచి జంతువుల అరుపుల్లా వినిపించేవి. ఇది కూడా ప్రజలకు ఒకరకమైన వినోదాన్ని అందించేది.

పాలు, తేనె తినిపించి మరీ.. నరకం చూపించే శిక్ష

పాలు తేనె, తినిపిస్తున్నారు కదా అని ఇదేదో జాలితో కూడిన శిక్ష అనుకోవద్దు. ఇది ఒక రకమైన క్రూరమైన ప్రక్రియ. ఈ శిక్షను ‘స్కాఫిజం’ అని పిలిచేవారు. అంటే.. పడవల్లో పెట్టడం అని అర్థం. నేరస్తుడిని రెండు పడవల మధ్య పెట్టి.. పైన మరొక పడవతో మూసేవారు. ఆ తర్వాత బాధితుడికి పాలు, తేనె తినిపించి.. వాటిని అతడి శరీరానికి కూడా పూసేవారు. ఈ తేనె వాసనకు.. తేనెటీగలు, కీటకాలు వచ్చి బాధితుడి శరీరాన్ని తినేవి. ఈ ప్రక్రియ కొన్ని రోజులపాటు సాగేది. నేరస్తుడు నరకయాతన అనుభవించి.. చనిపోయేవాడు. ఈ శిక్షలు చూసి అప్పట్లో నేరం చేయాలంటేనే వణికిపోయేవారు. ఆధునిక కాలంలో ఇలాంటి శిక్షలేవీ లేవు. అందుకే.. నేరగాళ్లకు కూడా భయం లేకుండా పోయింది. మీరు ఏమంటారు? ఇలాంటి శిక్షలు మళ్లీ అమలు చేయాలని అంటారు. మీ స్పందనను.. మా సోషల్ మీడియా పేజీల్లో కామెంట్స్ రూపంలో తెలపండి.

Also Read: రామాయణంలో లక్ష్మణుడి ప్రాణం కాపాడిన సంజీవని.. నిజంగానే ఒడిశాలోని ఈ కొండపై ఉందా?

Tags

Related News

సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!

రామాయణంలో లక్ష్మణుడి ప్రాణం కాపాడిన సంజీవని.. నిజంగానే ఒడిశాలోని ఈ కొండపై ఉందా?

సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సేఫ్‌గా ఎంజాయ్ చేయడానికి ఈ 5 ట్రిక్స్ ఫాలో అయిపోండి!

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!

ప్రకృతి చెక్కిన శిల్పాలు.. సూర్యాపేట గుట్టల్లో అద్భుతం.. చూసేందుకు క్యూ కట్టిన జనం!

ఒకే ఒక్క టికెట్‌తో.. ఆటో + బస్సు జర్నీ.. ఆర్టీసీ ఈ-ఆటోలు వచ్చేస్తున్నాయ్!

విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!

Big Stories

Advertisement
×