E-Paper
Advertisement

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది
Advertisement

Second Marriage on OTT : ప్రేమలో ఓటమి, పెళ్లిలో నిరాశ, జీవితంపై విరక్తి… ఇలాంటి అనుభవాల తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం అంత ఈజీ కాదు. ప్రతి ప్రేమకథకు సంతోషకరమైన ముగింపు ఉండదు. కొందరికి పెళ్లి తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. జీవిత భాగస్వామిపై పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోతే… మళ్లీ ఇంకొకరిని మనస్ఫూర్తిగా నమ్మగలమా ? గతం చేసిన గాయాలను మరచి కొత్త జీవితాన్ని ప్రారంభించడం సులభమేనా ? గత జ్ఞాపకాలు ప్రతి అడుగులో వెంటాడుతుంటే, మనసు మరోసారి ఒక బంధాన్ని అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది. కానీ జీవితమే మరో అవకాశం ఇస్తే ? ఆ అవకాశాన్ని స్వీకరించే ధైర్యం ఎంతమందికి ఉంటుంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘సెకండ్ మ్యారేజ్’ (Second Marriage) వెబ్ సిరీస్. ఎమోషన్, రొమాన్స్, కామెడీని మిళితం చేస్తూ, రెండో అవకాశానికి అసలు అర్థం ఏమిటో చెప్పే ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆకాశ్, చాందిని… వీరిద్దరూ జీవితంలో ఒకే రకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తులు. మొదటి వివాహం అనుకున్నట్లు సాగకపోవడంతో విడాకులు తీసుకుని, సింగిల్ గా ఉంటారు. బయటకు నార్మల్ గా కనిపించినా, లోపల మాత్రం గత జ్ఞాపకాల నుంచి బయటపడలేని పరిస్థితి. మరో బంధం అంటేనే భయం. మళ్లీ అదే బాధ ఎదురైతే అనే సందేహం.

Advertisement

వాళ్ళ డిప్రెషన్ ను గమనించిన కుటుంబ సభ్యులు, జీవితం ఒక్క తప్పుతో ముగిసిపోదని భావించి ఇద్దరికీ రెండో పెళ్లి జరిపిస్తారు. ఇష్టంలేని పరిస్థితుల్లో ఒకే ఇంట్లో అడుగు పెట్టిన ఆకాశ్, చాందిని భార్యాభర్తలుగా మారినా… మనసులు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా గత అనుభవాలే వారిని వెంటాడుతుంటాయి.

రోజులు గడిచే కొద్దీ రోజూ జరిగే చిన్న చిన్న సంఘటనలు వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం ప్రారంభిస్తాయి. మాటల్లో చెప్పలేని బాధలను ఒకరి కళ్లలో మరొకరు గుర్తిస్తారు. ఒకరికొకరు అండగా నిలుస్తూ, గతం మిగిల్చిన మానసిక గాయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో వచ్చే చిన్న చిన్న సరదా సంఘటనలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

Advertisement

కానీ ఆ సమస్యలు ఇంటి గడప దాటితే తీరిపోయేవి కాదు. రెండో పెళ్లిపై సమాజంలో ఉన్న అపోహలు, చుట్టుపక్కల జనాల కామెంట్స్, బంధువుల తీరు… ఇవన్నీ ఆ జంట కొత్త జీవితంపై మళ్లీ ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగగలిగారా ? గతాన్ని పూర్తిగా వదిలేసి కొత్త జీవితాన్ని నిజంగా ఆరంభించారా ? అనే విషయం తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే. సిరీస్ ముగింపును ముందే తెలుసుకోవడం కంటే, పాత్రలతో కలిసి ఆ ప్రయాణాన్ని అనుభవిస్తేనే అసలు ఫీల్ తెలుస్తుంది.

ఏ ఓటీటీలో చూడొచ్చు?

‘సెకండ్ మ్యారేజ్’ ETV Win Original వెబ్ సిరీస్. ప్రస్తుతం ఈ సిరీస్ మొత్తం ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ మహాదాస్యం, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రవితేజ మహాదాస్యమే దర్శకత్వం వహించారు. తమడ మీడియా నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామా సిరీస్ తెలుగు భాషలో అందుబాటులో ఉంది. కుటుంబంతో కలిసి చూసేలా ఎమోషన్, కామెడీ, రొమాన్స్‌ను మేళవించి ఈ సిరీస్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత కూడా జీవితం అక్కడితో ఆగిపోదని చెప్పే కథ ఇది. కామెడీ కూడా కావలసినంత ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్.

Read Also: డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్

Tags

Related News

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు.. ఆ 2 మాత్రం మిస్ అవ్వద్దు!

ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్

ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెడితే చావుతో చెలగాటమే… వణికించే కొరియన్ హారర్ థ్రిల్లర్ తెలుగులో

251 రూపాయలకే ఫోన్ పేరుతో దేశాన్ని మోసం చేసిన రియల్ స్కామ్… ఇప్పుడు తెలుగు సిరీస్‌గా ఓటీటీలోకి

Big Stories

Advertisement
×