E-Paper
Advertisement

ప్రోటీన్ పౌడర్ నిజంగా మంచిదేనా? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు?

ప్రోటీన్ పౌడర్ నిజంగా మంచిదేనా? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు?
Advertisement

Is protein powder safe: ఈ రోజుల్లో ఫిట్‌నెస్, సిక్స్ ప్యాక్, హెల్తీ బాడీ అందరికీ ఒక డ్రీమ్‌గా మారింది. దీంతో పాటు మార్కెట్‌లో ప్రోటీన్ పౌడర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. జిమ్‌కి వెళ్లే యువత నుంచి బరువు తగ్గాలనుకునే వారి వరకు ప్రతి ఒక్కరూ ప్రోటీన్ పౌడర్‌ని క్రమం తప్పకుండా వాడుతున్నారు. అయితే, ప్రోటీన్ పౌడర్ నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా? ఇది అందరూ వాడవచ్చా లేదా? అసలు ఎవరు తీసుకోవాలో, ఎవరు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం!

ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటి?

సాధారణంగా మనం తినే పాలు, గుడ్లు, సోయా, లేదా బఠానీల నుంచి ప్రోటీన్‌ను వేరు చేసి, ప్రాసెస్ చేసి పౌడర్ రూపంలోకి మారుస్తారు. మన శరీరానికి కండరాల పునర్నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు, హార్మోన్ల సమతుల్యతకు ప్రోటీన్ చాలా అవసరం. అయితే.. ఈ ప్రోటీన్‌ను సహజ ఆహారం నుంచి కాకుండా సప్లిమెంట్ రూపంలో.. వేగంగా శరీరానికి అందించడమే ఈ పౌడర్ల ముఖ్య ఉద్దేశం.

ప్రోటీన్ పౌడర్ వల్ల కలిగే లాభాలు:

Advertisement

కండరాల పెరుగుదల : వర్కవుట్ లేదా హెవీ ఎక్సర్‌సైజ్ చేసేవారికి కండరాలు త్వరగా రికవరీ అవ్వడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

బరువు నియంత్రణ: ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీని వల్ల పదే పదే జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గి, బరువు తగ్గడానికి సాయపడుతుంది.

Advertisement

సులభమైన పోషకాహారం: బిజీ లైఫ్‌స్టైల్‌లో సరైన సమయానికి సమతుల్య ఆహారం తీసుకోలేని వారికి ఇది ఒక క్విక్ ఆప్షన్‌గా పని చేస్తుంది.

ప్రోటీన్ పౌడర్ ఎవరు తీసుకోవాలి?

జిమ్, స్పోర్ట్స్ అండ్ ఎథ్లెట్స్: తీవ్రమైన వ్యాయామం, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారికి సాధారణ ఆహారం కంటే.. ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది. అలాంటి వారు దీనిని వాడవచ్చు.

ప్రోటీన్ లోపం ఉన్నవారు: డాక్టర్ సలహా మేరకు శరీరంలో తీవ్రమైన ప్రోటీన్ లోపం ఉన్నవారు తీసుకోవచ్చు.

వెజిటేరియన్స్ : రోజూవారీ ఆహారంలో ప్రొటీన్ సరిగ్గా అందని వెజిటేరియన్లు పరిమిత పరిమాణంలో వాడొచ్చు.

ఎవరు అస్సలు తీసుకోకూడదు?

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కిడ్నీల ఇన్ఫెక్షన్ లేదా సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ పౌడర్‌కి దూరంగా ఉండాలి. అధిక ప్రోటీన్ కిడ్నీలపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది.

కాలేయ వ్యాధులు ఉన్నవారు: లివర్ సరిగ్గా పనిచేయని వారు ప్రోటీన్ జీర్ణం చేసుకోవడం కష్టం.

జీర్ణశయాంతర సమస్యలు: అజీర్తి, కడుపు ఉబ్బరం లేదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ (పాలు పడని వారు) ఉన్నవారు వే-ప్రోటీన్ వాడితే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు రావచ్చు.

చిన్న పిల్లలు & గర్భిణులు: డాక్టర్ సలహా లేకుండా పిల్లలకు, గర్భిణులకు ప్రోటీన్ సప్లిమెంట్లు ఇవ్వకూడదు.

నాచురల్ ఆహారాలైన గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పనీర్, మొలకెత్తిన గింజల ద్వారా పొందే ప్రోటీన్ ఎల్లప్పుడూ అత్యంత.. సురక్షితమైనది. ప్రోటీన్ పౌడర్ అనేది కేవలం ఒక “సప్లిమెంట్” మాత్రమే, అది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోండి. మీ శారీరక కష్టానికి తగినట్లుగా నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహాతో మాత్రమే దీనిని వాడటం మంచిది .

Tags

Related News

అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా?

అసలైన ‘హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ’ రుచి చూడాలంటే.. పాతబస్తీలో ఈ 5 చోట్లకు వెళ్లాల్సిందే!

1000 కోట్ల వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడిన నిజాం.. ప్రపంచంలోనే నెం.1 ధనవంతుడు ఎలా అయ్యాడు?

నరనరాల్లో టెస్టోస్టెరాన్.. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయాలకే కోపపడతారు

రాత్రి డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా? ఎంత సేపు నడవాలి?

ఫ్రెండ్‌షిప్ డే వెనక ఉన్న.. అసలు కథ ఇదీ!

మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? రోజూ ఈ డ్రింక్ తాగితే మచ్చలు, మొటిమలు మాయం

Big Stories

Advertisement
×