E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 1st  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ మొత్తం విన్న మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today Episode September 1st  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ మొత్తం విన్న మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు నగల విషయంలో మనోహరిని రెచ్చగొట్టేందుకు కావాలనే మనోహరి రూం దగ్గరకు వెళ్లి మనోహరికి వినిపించేలా రాథోడ్‌, మిస్సమ్మ మాట్లాడుకుంటారు. మిస్సమ్మ తాను అమర్ తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తున్నానని.. పైగా ఆరు నగలు వేసుకుని వెళ్తున్నానని చెప్తుంది. పాపం మనోహరి నగలు లేకుండా వెళ్తుందేమో అని మిస్సమ్మ బాధపడినట్టు నటిస్తే.. రాథోడ్‌ ఏముంది మిస్సమ్మ ఏ గిల్టీ నగలో లేకపోతే బోసిపోయిన మెడతోనో వెళ్తుంది. అందుకు నువ్వు బాధపడటం ఏంటి అంటాడు. అయ్యో మనోహరి బోసిపోయిన మెడతో వెళ్లడం అంటే నాకు ఇష్టం లేదు రాథోడ్‌ అంటూ బాధపడినట్టు నటిస్తుంది మిస్సమ్మ.

దేనికైనా ప్రాప్తం ఉండాలి మిస్సమ్మ అంటూ రాథోడ్‌ చెప్తుంటే.. రూంలోంచి అంతా వింటున్న మనోహరి కోపంగా రాథోడ్‌ ఏ మాట్లాడుతున్నావు.. నాకు వినిపించాలని కావాలని ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారా..? కాస్త పక్కకు వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటుంది. ఆ మాటలకు మిస్సమ్మ సారీ మనోహరి నువ్వు రూంలోనే ఉన్నావా..? నేను చూడలేదు అంటూ నవ్వుకుంటుంది. రాథోడ్‌ మాత్రం మీ మాటలకు మనోహరి గారు ఫీల్‌ అయినట్టు ఉన్నారు మిస్సమ్మ అంటే.. అవును రాథోడ్‌ మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ రాథోడ్‌ను తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది మిస్సమ్మ.

Advertisement

మిస్సమ్మ, రాథోడ్‌  వెళ్లిపోయాక మనోహరి కోపంగా రూంలోకి వెళ్లిపోతుంది. వెనకే వెళ్లిన యాదమ్మ ఏంటి మనోహరి మీ ఆయనతో కలిసి బయటకు వెళ్తానన్నావు మళ్లీ రూంలోకి వచ్చావు అని అడిగితే.. ఎవరు మా ఆయన అంటూ మనోహరి కోపంగా తిడితే.. అదే నీకు కాబోయే భర్త అని యాదమ్మ అంటే వాడు నాకు డ్రైవర్‌ కూడా కాలేడు భర్త ఎలా అవుతాడు.. అయినా నువ్వు నాకో పని చేసి పెట్టాలి అని మనోహరి యాదమ్మను అడుగుతుంది. ఏం చేయాలో చెప్పు మనోహరి అంటూ యాదమ్మ అడిగితే.. భాగీ తన బీరువాలో దాచుకున్న ఆరు నగలు దొంగతనం చేయాలి. అని చెప్పగానే.. యాదమ్మ షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి దొంగతనం అనేది మా ఇంటా వంటా లేదు ఏదో మాయలు మంత్రాలు చేసుకుని బతుకుతుంటాము అంటూ చెప్తుంటే..

ఇక ఆపుతావా..? నీ సోది.. నువ్వు ఆ నగలు కొట్టేసి తీసుకొచ్చి ఇస్తే.. అందులో నీకు సగం వాటా ఇస్తాను అంటుంది మనోహరి. సగం వాటా అనేసరికి ఇంతకీ ఎలా కొట్టేయాలి ఆ నగలు అంటూ యాదమ్మ అడుగుతుంది. భాగీ బీరువాలో ఉంటాయి బీరువా బద్దలు కొట్టి నగలు కొట్టేయాలి అని చెప్తుంది. దీంతో యాదమ్మ ఏంటి మనోహరి నన్ను జైలుకు పంపించాలని ఏదైనా ప్లాన్‌ చేశావా..? అని అడుగుతుంది. నిన్ను నేను జైలుకు పంపించడం ఏంటి..? అని మనోహరి అడిగితే.. లేకపోతే ఏంటి మరి ఇంట్లో ఎవ్వరూ ఉండరు.. ఆ సమయంలో దొంగతనం జరిగితే పోలీసులు నన్నే కదా అనుమానించేది. అప్పుడు నేనే కదా జైలుకు వెళ్లేది అనగానే మరి ఏం చేయమంటావు నన్ను అని మనోహరి అడిగితే.. ఏం లేదు ఆ బీరువా తాళాలు తీసుకొచ్చి ఇవ్వు అందరూ వెళ్లిపోయాక బీరువాలో ఉన్న నగలు తీసుకొస్తాను అని చెప్తుంది యాదమ్మ.

Advertisement

ఇక తాళాలు ఉంటే నగలు తీసుకురావడానికి నువ్వే కావాలా.? అని మనోహరి ప్రశ్నిస్తే తాళాలు ఉన్నా కూడా నగలు కొట్టేయాలంటే కష్టమే మనోహరి.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటుంది యాదమ్మ. అయితే సరే తాళాలు ఎలాగైనా తీసుకొచ్చి ఇస్తాను. మేము బయటకు వెళ్లాకు నగలు తీసుకొచ్చి ఇక్కడే రూంలో భద్రపరుచు నేను తిరిగి వచ్చాక కలిసి ఇద్దరం పంచుకుందాం అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది.  పిచ్చి మనోహరి అన్ని నగలు నా చేతిలో పడ్డాక ఇక నువ్వు నాకు భాగం ఇవ్వడం ఏంటి.. వాటన్నింటినీ తీసుకుని కోల్‌కతా వెళ్లిపోతాను అని మనసులో అనుకుంటుంది యాదమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×