E-Paper
Advertisement

16 వందే భారత్, 22 అమృత్ భారత్ రైళ్లు.. ఆంధ్రాకు కేంద్రం కళ్లుచెదిరే కనెక్టివిటీ ప్లాన్!

16 వందే భారత్, 22 అమృత్ భారత్ రైళ్లు.. ఆంధ్రాకు కేంద్రం కళ్లుచెదిరే కనెక్టివిటీ ప్లాన్!
Advertisement

Massive Railway Boost for AP: ఆంధ్రప్రదేశ్‌ లో రైల్వే రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించరు. ముఖ్యంగా అమరావతిని కేంద్రంగా చేసుకుని రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు రూ.1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పోర్టులు, పర్యాటక ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం అవుతాయన్నారు.

విశాఖలో అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణవ్.. రాష్ట్రానికి గతంతో పోలిస్తే ఈసారి రైల్వే బడ్జెట్‌ లో భారీ పెరిగిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించగా, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.10,134 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని వివరించారు.   రాష్ట్ర రైల్వే అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను చూపుతోందన్నారు.

ఏపీకి 16 వందేభారత్, 22 అమృత్ భారత్ రైళ్లు

Advertisement

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ప్రయాణికుల కోసం 16 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. అదనంగా 22 అమృత్ భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయని చెప్పారు. ఈ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆధునిక సదుపాయాలతో కొత్త తరహా రైల్వే సేవలు అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికుల స్పందన కూడా పెరుగుతోందని చెప్పారు.

74 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం

రాష్ట్రంలోని 74 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు కూడా మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ఈ స్టేషన్లను పూర్తిగా పునర్నిర్మించి, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో స్టేషన్ రీడెవలప్‌మెంట్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 832 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ ల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 299 పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 1,759 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయని, ఇంకా 3,300 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం కొనసాగుతోందని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 100 శాతం రైల్వే విద్యుదీకరణ సాధించిందని మంత్రి చెప్పారు. దీంతో ఆధునిక రైల్వే వ్యవస్థ అమలులో రాష్ట్రం దేశంలో ముందున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే కారిడార్‌ను నాలుగు లైన్ల నెట్‌వర్క్‌ గా విస్తరించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీని వల్ల రైల్వే సామర్థ్యం రెట్టింపు కావడంతో పాటు భవిష్యత్తులో 500 కొత్త రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

ఏపీకి బుల్లెట్ రైలు కారిడార్లు

Advertisement

భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని మంత్రి వైష్ణవ్ వివరించారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు సుమారు 70 నిమిషాల్లో, చెన్నైకి 112 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి పూణేకు రెండు గంటల లోపు, బెంగళూరుకు కూడా దాదాపు రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉందన్నారు.

Read Also: ఇండియన్ బుల్లెట్ ట్రైన్ రెడీ.. గంటకు స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×