E-Paper
Advertisement

Telangana Politics: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్.. కీలక నేతలతో అభిప్రాయాలు సేకరణ

Telangana Politics: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్.. కీలక నేతలతో అభిప్రాయాలు సేకరణ
Advertisement

Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. ఈ మేరకు వార్ రూమ్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోల్ పెట్టనున్నట్లు సమాచారం. శాసన సభ్యుల తర్వాత, శానన మండలి సభ్యులు, ఆ తర్వాత డీసీసీ(DCC)లు, చైర్మన్ల నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కొరకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య లీడర్ల నుంచి పార్టీ వేర్వేరుగా అభిప్రాయాలను సేకరించనున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు అవుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ సర్కార్ ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోయినా.. వీటి అమల్లోకి వచ్చే సమస్యలు పై మాత్రం స్టడీ చేయనున్నది. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలోనూ ఈ మేరకు చర్చించనున్నట్లు తెలిసింది.

పార్టీలో కీ రోల్..

​స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే ఈ ప్రజాప్రతినిధులు మండల, జిల్లా పరిషత్ పాలనలో భాగస్వాములు అవుతారు. వీరు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికై, తమలో ఒకరిని మండల అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. గ్రామానికి, మండలానికి మధ్య వారధిగా పనిచేస్తారు. మండల స్థాయి నుంచి జిల్లా పరిషత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు తమలో ఒకరిని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. అయితే ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో అసలైన అనుసంధాన కార్తలు వీరే అని చెప్పవచ్చు. గ్రామీణ ఓటర్లతో వీరికి ఉండే ప్రత్యక్ష సంబంధం ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి కీలకంగా మారతాయని పార్టీ భావిస్తున్నది. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు స్పష్టంగా అందజేయడంలోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ల క్రియాశీలకంగా పనిచేస్తారు. అంతేగాక పార్టీలో భవిష్యత్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయి నుంచే ఎదుగుతారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్​యంలో ఈ వ్యవస్థ అమలు తీరుపై పార్టీ పూర్తి స్థాయిలో స్టడీ చేసి, ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇవ్వనున్నట్లు పార్టీ లీడర్లు చెప్తున్నారు.

Advertisement

Also Read: Gundeninda GudiGantalu Today episode: మీనా, శృతి డ్రామా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ..మీనాకు దిమ్మతిరిగే షాక్..

నిధులు, విధుల్లో సంక్షోభం..?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు గ్రామ, మండల స్థాయి అభివృద్ధిలో క్రీయాశీలక పాత్ర పోషించే వెసులుబాటు ఉంటుంది. కానీ గత కొన్ని ఏళ్లుగా ఈ సభ్యులకుసరైన నిధులు మంజూరు లేక, బడ్జెట్ లేని కారణంగా వీరి విధులకూ ఆటంకాలు ఏర్పడ్డాయి. పబ్లిక్ చేత ఎన్నికోబడినప్పటికీ, నామినేటెడ్ పదవుల రూపంలో వ్యవహరించాల్సిన పరిస్థితులు దాపురించాయి. దీనిపై సీఎం కూడా ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ రాజ్​ శాఖ నుంచి కూడా తగినంత వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ పరంగానూ పార్టీ అభిప్రాయ సేకరణ చేయనున్నది.

Advertisement

Also Read: ViswakSen : మ్యూజిక్ డైరెక్టర్ కు విశ్వక్ కాస్ట్లీ గిఫ్ట్.. ధర ఎంతో వింటే మైండ్ బ్లాకే..!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×