E-Paper
Advertisement

హైదరాబాద్‌కు దగ్గరలోనే అద్భుత జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ స్పాట్!

హైదరాబాద్‌కు దగ్గరలోనే అద్భుత జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ స్పాట్!
Advertisement

Scenic Waterfall Near Hyderabad: హైదరాబాద్‌లో నివసించే చాలా మంది అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూడాలంటే నగరానికి దూరంగా వెళ్లకతప్పదని భావిస్తారు. సాధారణంగా ఆదిలాబాద్, శ్రీశైలం, ఇతర అటవీ ప్రాంతాలకు గంటల తరబడి ప్రయాణించి మాత్రమే ప్రకృతి అందాలను ఆస్వాదించగలమని అనుకుంటారు. కానీ, చాలా మందికి తెలియని ఒక అందమైన జలపాతం హైదరాబాద్‌ కు అత్యంత సమీపంలోనే ఉంది. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అద్భుత జలపాతం అంతరగంగ  

ఈ జలపాతం ఎల్‌బీ నగర్‌ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావడిపల్లి గ్రామం సమీపంలో ఉంది. వర్షాకాలం ప్రారంభమైన ఈ సమయంలో అంతరగంగ జలపాతం అద్భుత సోయగంతో ఆకట్టుకుంటుంది. వర్షాలు కురవడంతో చుట్టూ ఉన్న కొండలు, చెట్లు, పొదలు పచ్చదనంతో కళకళలాడుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అంతరగంగ సాధారణ పర్యాటక ప్రదేశాల మాదిరిగా ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించిన పార్కులు, వ్యూయింగ్ పాయింట్లు, ఇతర సౌకర్యాలు ఉండవు. పూర్తిగా సహజసిద్ధమైన ప్రాంతం. అందుకే ఇక్కడికి వచ్చే వారు ప్రకృతిని మరింత దగ్గరగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

ట్రెక్కింగ్ తర్వాత జలపాత అందాలు  

Advertisement

జలపాతాన్ని చేరుకోవడానికి కొంత ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. వాహనాన్ని కొండల దిగువన పార్క్ చేసిన తర్వాత సుమారు అరగంట పాటు నడవాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో చిన్న నీటి ప్రవాహాలు, రాళ్లతో కూడిన దారులు, పచ్చని పరిసరాలు కనిపిస్తూ ప్రయాణాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. ట్రెక్కింగ్ పూర్తయ్యాక కనిపించే దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన రాతి కొండలపై నుంచి నీరు కిందకు జాలువారుతూ సహజసిద్ధమైన నీటి కొలనుల్లో కలుస్తుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలారావాలు, ప్రవహించే నీటి శబ్దం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నగర రద్దీ, ట్రాఫిక్ రభసకు దూరంగా ప్రకృతిలో కొంత సమయం గడపాలనుకునే వారికి ఇది మంచి గమ్యస్థానంగా చెప్పవచ్చు.

అంతరగంగకు ఎలా వెళ్లాలంటే?

అంతరగంగకు వెళ్లాలనుకునే వారు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో అబ్దుల్లాపూర్‌ మెట్ దాటి అనాజ్‌ పూర్ సమీపంలో ఉన్న గ్రామీణ రహదారి ద్వారా కావడిపల్లికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి కొండల పాదాల వరకు వాహనంలో వెళ్లి ట్రెక్కింగ్ ప్రారంభించాలి.

ఏ ప్రాంతంలో వెళ్తే మంచిదంటే?

Advertisement

ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉదయం బెస్ట్ అని భావిస్తారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య వెళితే చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. వర్షం పడిన ఒకటి, రెండు రోజుల తర్వాత వెళ్లడం మరింత మంచిది. అప్పుడే జలపాతం నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అయితే, అక్కడ ఎలాంటి దుకాణాలు, టీ స్టాల్స్, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి గదులు ఉండవు. అక్కడికి వెళ్లాలంటే వాటర్, ఫుడ్, ట్రెక్కింగ్‌ కు అనుకూలంగా ఉండే  షూ తీసుకెళ్లడం మంచిది. ప్రకృతిని దగ్గరగా ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకునే హైదరాబాద్ వాసులకు అంతరగంగ జలపాతం ఒక అద్భుతమైన వీకెండ్ డెస్టినేషన్‌ గా చెప్పుకోవచ్చు.

Read Also: కాశ్మీర్-లడఖ్‌ కు 365 రోజుల కనెక్టివిటీ.. జోజిలా టన్నెల్ తవ్వకం పూర్తి!

Related News

ఒకే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. భారత్‌ లోని అత్యంత విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇదే!

వెయ్యేళ్లుగా శివలింగంపై చెదరని ఛాయ.. ఆశ్చర్యపరుస్తున్న పానగల్లు ఆలయం మిస్టరీ!

భారత్ లో ఎడమ వైపు, అమెరికాలో కుడివైపు.. వాహనాలు నడిపే విధానంలో ఎందుకీ తేడా?

ఆకుపచ్చ నగరంగా మారిన కాంక్రీట్ జంగిల్‌.. ఇది కదా నిజమైన గ్రీన్ రివల్యూషన్ అంటే!

నల్లగొండ జిల్లాలో వజ్రాలు, బంగారు గనులు, వామ్మో.. అన్ని చోట్ల ఉన్నాయా?

విదేశాల్లో యుపిఐ హవా.. ఈ 10 దేశాల్లో భారతీయులు యుపిఐతో పేమెంట్స్ చేయవచ్చు

సిద్దిపేట పేరు వెనుక మూడు ఆసక్తికరమైన కథలు!

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సంచలనం.. శిలాశాసనం బయటపెట్టిన 500 ఏళ్ల రహస్యం!

Big Stories

Advertisement
×