IRCTC Agent Business: ఈ రోజుల్లో చాలా మంది తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. అలాంటి వారు IRCTC ఏజెంట్ గా చేరడం బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. భారతీయ రైల్వేకు సంబంధించిన సేవలను అందించే IRCTC ద్వారా మీరు టికెట్ బుకింగ్ చేసి కమీషన్ సంపాదించవచ్చు.
దేశంలో ప్రతి రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అయితే, వారంతా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేయలేరు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్నవారికి టిక్కెట్లు బుక్ చేయడం అనేది అంత ఈజీగా కాదు. వారు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు IRCTC ఏజెంట్లను ఆశ్రయిస్తారు. ఏజెంట్లు వారి తరఫున టిక్కెట్లు బుక్ చేసి, కొంత కమీషన్ పొందుతారు. ఇదే వారి ఆదాయం.
IRCTC ఏజెంట్ గా మారడానికి మీరు ముందుగా ఆన్ లైన్ లో అప్లై చేయాలి. అధికారిక వెబ్ సైట్ లేదంటే అథరైజ్డ్ పార్ట్నర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సమయంలో మీ ఆధార్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, ఫోటో లాంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ను పరిశీలిస్తారు. అఫ్రూవల్ వచ్చిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో మీరు అధికారికంగా IRCTC ఏజెంట్ గా పని చేయవచ్చు. ఇక ఫీజుల విషయానికి వస్తే, ఏజెంట్ గా రిజిస్టర్ కావడానికి కొన్ని ఛార్జీలు ఉంటాయి. మీరు ఎంచుకునే ప్లాన్ మీద ఆధారపడి ఫీజులు మారుతాయి. సాధారణంగా ఒక సంవత్సరం ప్లాన్ సుమారు రూ. 3,999 నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని ప్రీమియం ప్లాన్లు రూ.6,999 వరకు ఉండొచ్చు. ఈ ఫీజు చెల్లించిన తర్వాత మీరు సిస్టమ్ యాక్సెస్ పొందుతారు.
IRCTC ఏజెంట్‌గా మీరు కేవలం రైలు టిక్కెట్లు మాత్రమే కాదు, ఇతర సేవలు కూడా అందించవచ్చు. విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్, టూర్ ప్యాకేజీలు లాంటి సర్వీసులు కూడా అందించే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం మరింత పెరుగుతుంది. ప్రతి టిక్కెట్ పై మీరు ఒక ఫిక్స్ డ్ కమీషన్ పొందుతారు. రోజుకు ఎక్కువ బుకింగ్ లు చేస్తే మంచి ఆదాయం సాధ్యమవుతుంది. ఈ బిజినెస్ లో మరో మంచి విషయం ఏమిటంటే, ఇంటి నుంచే ఈ పని చేసుకోవచ్చు. కంప్యూటర్ లేదంటే మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఏసీ టిక్కెట్ బుక్ చేస్తే రూ. 40, నాన్ ఏసీ టిక్కెట్ బుక్ చేస్తే రూ. 20 కమిషన్ వస్తుంది. ఒక్కో ఏజెంట్ నెలకు రూ. 30 వేల నుంచి రూ. 80 వేల వరకు సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టండి.
Read Also: రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్.. ఫుల్ రీఫండ్ రావాలంటే?