E-Paper
Advertisement

Rythu Bharosa: పీఎం కిసాన్ దారిలో రైతు భరోసా.. నిధుల జమ మార్పుపై క్లారిటీ ఇవ్వని సర్కార్!

Rythu Bharosa: పీఎం కిసాన్ దారిలో రైతు భరోసా.. నిధుల జమ మార్పుపై క్లారిటీ ఇవ్వని సర్కార్!
Advertisement

Rythu Bharosa: స్వేచ్ఛ బ్యూరో: రైతాంగంలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరాలోపు రైతులందరికీ అందజేస్తామని ప్రకటించింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. గతానికి భిన్నంగా ఈసారి రైతుల ఖాతాల్లో నిధులు జమకావడంతో ఇప్పుడు చర్చకుదారితీసింది. తమపై భూమి ఎకరానే ఉందా అనే అనుమానం.. ఆందోళన మొదలైంది. వ్యవసాయ అధికారులు, బ్యాంకులకు రైతులు పరుగులు తీస్తున్నారు.

తొలి విడుతగా ఎకరలోపు..

రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కింద రైతుభరోసా పథకంతో అందజేస్తుంది. ఎకరాకు 6వేల చొప్పున ఏటా(వానకాలం, యాసంగి) రెండు విడుతలుగా 12వేలు అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73.55లక్షల మంది రైతులు 1.50కోట్ల ఎకరాలకు రైతు భరోసాను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాసంగి రైతు భరోసా నిధులను మూడు విడుతల వారీగా జమ చేస్తున్నట్లు ప్రకటించింది. తొలి విడుతగా ఎకరలోపు రైతుల ఖాతాలో ఈ నెల 23(సోమవారం)జమచేసింది. 68.90లక్షల మంది రైతుల ఖాతాల్లో 57.45లక్షల ఎకరాలకు 3446.94కోట్లు జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడ‌త‌గా మ‌రో 20 రోజుల త‌ర్వాత రూ.2,650 కోట్లు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోపు మూడో విడ‌త‌గా 2760 మొత్తం రైతు భ‌రోసా నిధులు విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.. మూడు విడ‌త‌ల్లో క‌లిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు జమకానున్నాయి. ఇప్పటివరకు ఎదురుచూసిన రైతులకు ప్రభుత్వ ప్రకటన భరోసా నిచ్చినట్లయింది.

Advertisement

Also Read: Property Tax: మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

రైతుల్లో ఆందోళన..

అయితే ఇక్కడే అసలు సమస్యల మొదలైంది. గతంలో ఎకరాల వారీగా ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాలోపు రైతులు 28.58లక్షల మంది రైతులు ఉండగా వారికీ తొలి విడుతగా, 2 ఎకరాలలోపు రైతులు 18.17లక్షలు రెండో విడతగా, 3 ఎకరాలలోపు రైతులు 10.89లక్షల మంది రైతులు ఉంటే మూడో విడుతగా, 4 ఎకరాలలోపు 6.51లక్షల మంది నాల్గొ విడుతగా నిధులను బట్టి రైతుల ఖాతాల్లో జమచేసేది. అయితే ఈసారి రైతులు ఎంతమంది ఉంటే అంతమందికి ఎకరాకు 6వేల చొప్పున నిధులు జమచేసింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. అసలు తమకు ఎకరా మాత్రమే నమోదు అయిందా? లేకుంటే బ్యాంకర్లు ఏమైనా లోను డబ్బులు కట్టుకున్నారా? లేకుంటే మిగతా భూమి ఏమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు తెలుసుకునేందుకు రైతులు బ్యాంకులకు, వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎందుకు తప్పుగా పడిందని ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. 5 ఎకరాలు ఉన్న రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా నిధులు ఖాతాల్లో పడేవి. ఇప్పుడు ఒక్క ఎకరాకు మాత్రమే నిధులు జమకావడంతో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ముందస్తుగా ఇవ్వకపోవడంతోనే ఈ కన్ ప్యూజియన్ కు దారితీసిందనే ప్రచారం జరుగుతుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

Advertisement

మిగతా ఎకరాలకు పడుతుందా? లేదా? అనే అనుమానాలు సైతం రైతుల్లో నెలకొన్నాయి. గతానికి భిన్నంగా రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క ఎకరాకు రైతు భరోసా నిధులు జమకావడంతో చర్చకు దారితీసింది. కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భూమి ఉన్న ప్రతి ఒక్కరికి 2వేలు చొప్పున ఏడాదికి 2వేలు అందజేస్తుంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల ఖాతాల్లో 2వేలు చొప్పున జమచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సైతం అదే విధంగా వేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన రైతులకు భరోసా నిధులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమకు ఇస్తారా? ఇవ్వరా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ముందస్తుగా రైతులకు క్లారిటీ ఇవ్వకపోవడం.. గతానికి భిన్నంగా నిధులు జమచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఎమైనా ప్రభుత్వం రైతులకు భరోసా నిధులపై క్లారిటీ ఇస్తే తప్ప రైతుల్లో ఆందోళన తొలగిపోయే అవకాశం లేదు.

Also Read: Araku Murder: అరకులో దారుణం.. రిసార్ట్స్‌లో వ్యక్తి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ పర్యాటక ప్రాంతం

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×