Free Biryani For 1 Year: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్. నగరంలో అద్భుతమైన బిర్యానీ అందించే పలు రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బావర్చి బిర్యానీ సెంటర్. కొన్ని దశాబ్దాలుగా ఎంతో మందికి ఘుమ ఘుమలాడే రుచికరమైన బిర్యానీ అందిస్తోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కచ్చితంగా బావర్చి బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. ఎంతో పేరున్న ఈ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేలా తరచుగా ఆఫర్లు కూడా అందిస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఏడాదంతా ప్రతి రోజూ ఉచితంగా బిర్యానీ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ను ఎలా పొందాలంటే..
ఏడాదంతా ఫ్రీ బావర్చి బిర్యానీ
ఈ రోజుల్లో చాలా మంది ఆన్ లైన్ ద్వారానే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది మ్యాజిక్ పిన్ యాప్. దీని ద్వారా చాలా మంది బిర్యానీ ఆర్డర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ ఉచితంగా ఏడాదంతా బావర్చి బిర్యానీ పొందే అవకాశం కల్పిస్తోంది. మ్యాజిక్ పిన్ యాప్ ఓపెన్ చేయగానే ఫ్రీ బిర్యానీ ఎవ్రీ డే అనే ఆఫర్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేసి.. జస్ట్ రూ. 9 చెల్లించి లక్కీ డ్రాలో జాయిన్ కావచ్చు. ఈ డ్రాలో ఒకవేళ విన్నర్ అయితే, ఏడాదంతా ప్రతి రోజూ ఉచితంగా బావర్చి బిర్యానీ పొందే అవకాశం ఉంటుంది.
ఒకవేళ డ్రాలో విన్ కాకపోతే ఎలా?
ఈ లక్కీ డ్రాలో విన్ కాకపోయిన బాధ పడాల్సిన అవసరం లేదు అంటోంది మ్యాజిక్ పిన్ యాప్. సింపుల్ గా రూ. 99కి బావర్చి బిర్యానీ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోయేదేమీ లేదు. వచ్చిందనుకో ఏడాదంతా ఫ్రీ బిర్యానీ. రాలేదనుకో జస్ట్ రూ. 99కి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆఫర్ ట్రై చేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. హ్యాపీగా బావర్చి బిర్యానీ రుచి చూడండి.
Read Also: హైదరాబాద్ లో ఇదే కాస్ట్లీయెస్ట్ బిర్యానీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!