Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఇక్కడ దొరికే ఫుడ్ టేస్టీ మరెక్కడా లభించదు. ప్యారడైజ్, బావర్చి, కేఫ్ బహార్ లాంటి రెస్టారెంట్ల ఆహా అనిపించే బిర్యానీ లభిస్తుంది. ధర కూడా మరీ ఎక్కువ ఏం ఉండదు. సింగిల్ ప్లేట్ కు రూ. 250 నుంచి రూ. 450 వరకు ఉంటుంది. ఇంకాస్త మంచి హోటల్ అయితే రూ. 500 వరకు ఉంటుంది. అయితే, హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన బిర్యానీ ఎక్కడ లభిస్తుంది? దాని ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బిర్యానీ
హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన బిర్యానీ ఐటీసీ కోహినూర్ హోటళ్లో లభిస్తుంది. ఈ హోటల్ లోని 10వ అంతస్తులో ఉన్న దమ్ పుఖ్త్ రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో దమ్ బిర్యానీ ధర అక్షరాలా రూ. 2500. అద్భుతమైన గోష్ట్ బిర్యానీ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ బిర్యానీని నాణ్యమైన పొట్టేలు మాంసంతో తయారు చేస్తారు. ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి ఎంతో టేస్టీగా తయారు చేస్తారు. తక్కువ మంటతో నిదానంగా వండటం మూలంగా మంచి రుచిని పొందుతుంది. ఇక్కడ ఎంతో అద్భుతమైన ఆతిథ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి బిర్యానీ తింటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. బుక్క బుక్కను ఆస్వాదిస్తూ లాగించేయొచ్చు. నిజమైన లగ్జరీ భోజన అనుభవాన్ని పొందవచ్చు. మీరూ ఓసారి ఆ అనుభూతి పొందాలంటే ఒక్కసారి ట్రై చేయండి.
Read Also: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!
నెటిజన్ల ఏం అంటున్నారంటే?
అటు ఐటీసీ కోహినూర్ బిర్యానీ పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది అద్భుతం అంటే, మరికొంత మంది అంత ధర ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. “రూ.2500 పెడితే షాదాబ్ బిర్యానీలో 10 మంది తింటారు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “వద్దు మావా.. నేను బావర్చిలోనే డబుల్ మసాలా వేసుకుని తింటా” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “నిజంగా దమ్ పుఖ్త్ రెస్టారెంట్ లో బిర్యానీ టేస్టీ చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “దానికంటి షాబాద్ బెస్ట్” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “నిజం చెప్పాలంటే, నేను కూడా అక్కడ తిన్నాను. కానీ, రుచి, క్వాంటిటీ అంతగా నచ్చలేదు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఎక్కువ ఆర్భాటం ఉన్న దగ్గర బిర్యానీ అంతగా టేస్టీ ఉండదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?