West Bengal News: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జల్పైగురి జిల్లాలోని మాయనగిరిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దారుణం చంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రమేష్ రాయ్ తన భార్య దీపాలి రాయ్ అతి కిరాతకంగా చంపాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి దారుణంగా చంపేశాడు. చంపేసి గుండెను వేరు చేశాడు. చంపిన అనంతరం పొరుగువారికి ఆ శరీర భాగాలను చూపించాడు. దీంతో స్థానిక ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందు శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు.
ALSO READ: Sahasra Murder Case: సహస్ర హత్య.. ఏం చెయ్యాలో రాసుకుని మరి చోరీ, ఆ లెటర్‌లో ఏం ఉందంటే?
మాయనగురి పీఎస్ ఇంఛార్జి సుబల్ చంద్ర ఘోష్ మాట్లాడుతూ.. ఈ రోజే ఉదయం ఈ నేరం జరిగిందని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు తన భార్య శరీర భాగాలను పదునైన కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడని వెల్లడించారు. చంపిన తర్వాత శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి సంచివేసుకుని తిరగాడని చెప్పారు.
ALSO READ: DSSSB Recruitment: అద్భుతమైన అవకాశం.. ఇంటర్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..
పోలీసులు దీపాలి రాయ్ (45) శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రమేష్ రాయ్, దీపాలి రాయ్ దంపతులకు ఒక కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం రమేష్ రాయ్ ను అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. ఈ ఘోరమైన సంఘటన స్థానికులలో భయాందోళనలను కలిగించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు.