E-Paper
Advertisement

రైల్లో పెళ్లి బరాత్.. నెట్టింట వీడియో వైరల్, ఏం ఎంజాయ్ గురూ!

రైల్లో పెళ్లి బరాత్.. నెట్టింట వీడియో వైరల్, ఏం ఎంజాయ్ గురూ!
Advertisement

Wedding Celebrations Inside Train Coach: ఓ మార్వాడీ ఫ్యామిలీ పెళ్లి ప్రయాణాన్ని క్రేజీగా ప్లాన్ చేసింది. మొత్తం రైల్వే కోచ్‌ ను బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

రైలు కోచ్ లో పెళ్లి బరాత్

ఇక ఈ వీడియోలను దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లి బారాత్ రోడ్డు మీద జరుగుతుంది. కానీ, వీళ్లు రైలు కోచ్ లోనే బరాత్ చేశారు. కోచ్‌ లోకి అడుగు పెట్టగానే రంగు రంగుల అలంకరణలు, వెల్ కమ్ పోస్టర్లు, కుటుంబ సభ్యుల ఆనందం కలిసి పండుగలా కనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేస్తూ సంతోషంగా ప్రయాణాన్ని కొనసాగించారు.

Advertisement

ఈ వీడియోలో మరో హైలైట్ ఏమిటంటే.. కాబోయే వధువు రైలులోనే కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులంతా చుట్టూ చేరి వారిని అభినందిస్తూ, ఆ స్పెషల్ మూమెంట్ ను మరింత స్పెషల్ గా మార్చారు. కోచ్‌లో గిఫ్టులతో కూడిన బాక్సులు కూడా కనిపించాయి. ఇవి పెళ్లి సంప్రదాయాల్లో భాగమైన మయ్రా, భాత్  కోసం తీసుకువచ్చినవిగా భావిస్తున్నారు.

కుటుంబ సభ్యుల హడావిడిలో టీసీ తన పని చేసుకుంటూ..  

ఈ మొత్తం హడావుడిలో  ఒక టికెట్ కలెక్టర్ తన పని చేసుకుంటూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. అతడు కూడా ఆ సంతోషకరమైన వాతావరణంలో భాగమై నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో హైలెట్ అయ్యింది.

Advertisement

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అభినందించారు. కుటుంబం అంతా కలిసి ఒకే చోట ప్రయాణిస్తూ, పెళ్లి వేడుకను  జరుపుకోవడం చాలా అరుదైన విషయం అంటూ కొనియాడారు. కొందరు దీన్ని భారతీయ సంస్కృతికి నిదర్శణంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా ఎక్స్ పీరియెన్స్ చేయాలని కొంత మంది కామెంట్స్ చేశారు.  మరికొంత మంది ఈ వేడుకపై నెగెటివ్ గా కామెంట్స్ చేశారు. రైలులో ఇంత పెద్ద సౌండ్స్ చేస్తూ వేడుకలు జరపడం సరైనది కాదంటూ కామెంట్స్ పెట్టారు. పూర్తి కోచ్‌ ను ప్రైవేట్ ఈవెంట్ కోసం బుక్ చేయడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలగవా? మరికొంత మంది అనుమానం వ్యక్తం చేశారు.

ఎవరైనా రైలు కోచ్ బుక్ చేసుకోవచ్చు!

నిజానికి రైలు కోచ్ బుక్ చేసుకునే విధానం ఇప్పుడే కొత్తగా ఏమీ రాలేదు. భారతీయ రైల్వే IRCTC ద్వారా ఫుల్ టారిఫ్ రేట్ (FTR) అనే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ స్కీమ్ కింత వ్యక్తులు, గ్రూపులు పూర్తి కోచ్ లేదంటే మొత్తం రైలును కూడా బుక్ చేసుకోవచ్చు. దీనికి ముందుగానే ప్లానింగ్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.

Read Also: వందే భారత్ రైలు ఎక్కుతున్నారా? దోమల బ్యాట్ తీసుకెళ్లండి!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×