E-Paper
Advertisement

కార్తీక దీపం సీరియల్ కు నిరుపమ్ మొదటి ఎంపిక కాదా..అలా ఛాన్స్ వచ్చిందా!

కార్తీక దీపం సీరియల్ కు నిరుపమ్ మొదటి ఎంపిక కాదా..అలా ఛాన్స్ వచ్చిందా!
Advertisement

Karthika Deepam Serial: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంత మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో కార్తీకదీపం సీరియల్ ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ రెండో భాగం కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ కు మంచి ఆదరణ రావడంతో సీక్వెల్ కూడా ప్రారంభించారు ఇందులో కార్తీక్ పాత్రలో పరిటాల నిరుపమ్(Paritala Nirupam) ఎంతో చక్కగా నటిస్తూ అందరి మదిలో డాక్టర్ బాబుగానే స్థిర పడిపోయారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కార్తీకదీపం ఫస్ట్ ఛాయిస్ నేను కాదు..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కార్తీకదీపం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ తాను కార్తీకదీపం సీరియల్ కు ఫస్ట్ ఛాయిస్ కాదని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. మరి ఈయన కాకుండా ఈ సీరియల్ కు మొదట ఎంపికైనటువంటి వారు ఎవరు? ఎందుకు వద్దనుకున్నారనే విషయానికి వస్తే.. కార్తీకదీపం ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వరరావు గారి ప్రొడక్షన్లో తాను మూగమనసులు అనే సీరియల్ చేశాను. ఇక ఈయన ప్రొడక్షన్ లోనే కార్తీకదీపం సీరియల్ చేయాలనుకున్నారు. ఇక ఈ సీరియల్ చేయాలనుకునే సమయంలోనే తాను స్టార్ మా లో కుంకుమపువ్వు అనే సీరియల్ లో చేస్తున్నానని తెలిపారు.

కార్తీక్ పాతకు ఎవ్వరూ సెట్ అవ్వ లేదు…

Advertisement

ఒక సీరియల్లో చేస్తున్నప్పుడు మరో సీరియల్ చేయడానికి లేదు. గుత్తా వెంకటేశ్వర్ రావు గారు ముందు నన్ను కన్సిడర్ కాలేదు కానీ ఈ సీరియల్ గురించి ప్రతిరోజు నాతో డిస్కషన్ చేసేవారు ఎవరైనా హీరో ఉంటే చెప్పమని అడిగారు. నేను కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాను. వాళ్ళకు లుక్ టెస్ట్ ఆడిషన్ వంటివి చేశారు. వాళ్ళు ఎవరు సెట్ కాకపోవడంతో తిరిగి తిరిగి కార్తీక్ పాత్ర నా వద్దకే వచ్చిందని తెలిపారు. అప్పటికి నేను కుంకుమపువ్వు సీరియల్ చేస్తున్నానని చెప్పినప్పటికీ పర్లేదు ఈ క్యారెక్టర్ కు సెట్ అవుతారని గుత్తా వెంకటేశ్వర్ రావు గారు నన్ను ఒప్పించారని నిరుపమ్ తెలిపారు.

కార్తీక్ అనే పేరు బాగా కలిసి వచ్చింది…

Advertisement

కార్తీకదీపం సీరియల్ అనుకున్న సమయంలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ నేను కాదని చాలామందిని సెలెక్ట్ చేసిన తర్వాత వారు సెట్ అవ్వకపోవడంతోనే ఆ పాత్ర నాకు వచ్చిందంటూ నిరుపమ్ తెలిపారు. ఇక ఈ సీరియల్ అయిపోయిన తర్వాత బయట ఎవరైనా తనని కార్తీక్ అని పిలుస్తే టక్కున తిరిగేస్తానని తెలిపారు. చంద్రముఖి సీరియల్ లో కూడా నా పాత్ర పేరు కార్తీక్ ఇక కార్తీకదీపం లో కూడా కార్తీక్ కావడంతో చాలామంది నీకు నిరుపమ్ అనే పేరుకంటే కార్తీక్ అనే పేరు బాగుంటుంది అంటూ చెప్పారని నిరుపమ్ ఈ సందర్భంగా కార్తీకదీపం సీరియల్ అవకాశం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: కార్తీకదీపం డాక్టర్ బాబుకు చిరంజీవి తల్లి స్పెషల్ గిఫ్ట్…అంత పెద్ద ఫ్యానా!

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×