E-Paper
Advertisement

చిన్న తెగ నుంచి IAS వరకు.. దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

చిన్న తెగ నుంచి IAS వరకు.. దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!
Advertisement

Caroline Ching IAS Inspiring Journey: నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు కరోలిన్ చింగ్‌థియాన్‌మావి. మణిపూర్‌లోని లామ్‌కా ప్రాంతానికి చెందిన ఆమె.. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసుల్లో ఒకటైన ఐఏఎస్‌ ను క్రాక్ చేశారు. థాంగ్‌ఖాల్ తెగకు చెందిన తొలి ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఒక చిన్న తెగకు చెందిన ఆమె.. ఐఏఎస్ అధికారి వరకు సాగించిన ప్రయాణం సాధారణమైనది కాదు. ముఖ్యంగా ఎలాంటి స్పెషల్ కోచింగ్ లేకుండానే సివిల్ సర్వీసెస్‌ లో విజయం సాధించి అబ్బుర పరిచారు.

మణిపూర్‌లోని సాధారణ కుటుంబం నుంచి..

కరోలిన్ చింగ్‌థియాన్‌మావి మణిపూర్‌లోని లామ్‌కా ప్రాంతానికి చెందినవారు. మువాల్ వెంగ్, హియాంగ్‌టామ్ ప్రాంతాలకు చెందిన కరోలిన్ టి. పౌమిన్‌లియాన్‌థాంగ్, లామ్‌నేకిమ్ దంపతులకు కుమార్తె. నలుగురు పిల్లల్లో కరోలిన్ మూడో సంతానం. ఆమెకు ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. కుటుంబ నేపథ్యం కూడా ఆమె జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. తండ్రి థాంగ్‌ఖాల్ ప్రజా సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. తల్లి కూడా మహిళా సంఘంలో సేవలందించారు. సామాజిక బాధ్యతలతో పరిచయం ఉన్న కుటుంబ వాతావరణం కరోలిన్‌పై ప్రభావం చూపించింది.

చదువుల్లో ఎప్పుడూ ముందే!   

Advertisement

కరోలిన్ చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఉన్నత విద్యలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. 2020లో మణిపూర్ యూనివర్సిటీ పరిధిలో బీకాం ఆనర్స్ పూర్తి చేసిన ఆమె.. యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. అయితే, చదువులో మంచి మార్కులు సాధించడం దగ్గరే ఆమె ప్రయాణం ఆగిపోలేదు. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో కరోలిన్ సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. సాధారణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యే చాలామంది అభ్యర్థులు స్పెషల్ కోచింగ్ తీసుకుంటారు. కానీ కరోలిన్ మాత్రం ఎలాంటి కోచింగ్ లేకుండానే తన సొంత ప్రయత్నంతో పరీక్షకు సిద్ధమై విజయం సాధించారు. క్రమశిక్షణతో చదవడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, పట్టుదలతో ముందుకు సాగడం ఆమె విజయానికి కారణంగా చెప్పారు.

థాంగ్‌ఖాల్ తెగ నుంచి తొలి ఐఏఎస్

కరోలిన్ విజయం వ్యక్తిగతంగా ఆమెకు మాత్రమే కాదు.. ఆమెకు చెందిన థాంగ్‌ఖాల్ సమాజానికి కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఆ తెగ నుంచి తొలి ఐఏఎస్ అధికారిగా ఆమె గుర్తింపు పొందడం అక్కడి యువతకు కొత్త ఆశలు కలిగించింది. తమ ప్రాంతం, తమ సామాజిక నేపథ్యం తమ లక్ష్యాలకు అడ్డంకి కాదని ఆమె ప్రయాణం చెబుతోంది. అవకాశాలు పరిమితంగా ఉన్నా.. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని ఆమె నిరూపించారు.

దేవరకొండ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు

Advertisement

తాజాగా ఆమె నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్ కలెక్టర్‌ గా బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలనలో ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా చూడటం లాంటి బాధ్యతలను ఆమె నిర్వర్తించాల్సి ఉంటుంది. మణిపూర్‌లోని ఒక చిన్న తెగ నుంచి బయలుదేరి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి.. ఆ తర్వాత ఐఏఎస్‌గా ఎదిగి.. ఇప్పుడు తెలంగాణలో కీలక పరిపాలనా బాధ్యతలు చేపట్టడం కరోలిన్ ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. కలలు కనడానికి నేపథ్యం అడ్డంకి కాదు.. వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదల ఉంటే చాలని కరోలిన్ చింగ్‌థియాన్‌మావి విజయగాథ మరోసారి గుర్తుచేస్తోంది.

Read Also: నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నల్లగొండ, ఏకంగా సెకెండ్ ప్లేస్ కైవసం!

Tags

Related News

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

జియో IPO వస్తే ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

హిమాలయాల్లో రైల్వే రూట్.. ఏకంగా 80 శాతానికి పైగా భూగర్భంలోనే!

Big Stories

Advertisement
×