E-Paper
Advertisement

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!
Advertisement

Android Auto Battery Drain: కారులో ప్రయాణం చేసేటప్పుడు ఆండ్రాయిడ్ ఆటో వాడటం చాలా సౌకర్యంగా ఉంటుంది. దారి చూసేందుకు మ్యాప్స్ పెట్టుకోవడం, ఇష్టమైన పాటలు వినడం, ఎవరితోనైనా కాల్స్ మాట్లాడటం వంటివన్నీ దీనివల్ల చాలా సులభమవుతాయి. కానీ, ఈ సౌకర్యం వెనుక ఒక పెద్ద సమస్య ఉంది. అదే ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోవడం. కారు దిగేసరికి ఫోన్ డెడ్ అయిపోతుంటుంది చాలాసార్లు. అసలు ఆండ్రాయిడ్ ఆటో వాడినప్పుడు మన ఫోన్ బ్యాటరీ ఎందుకు అంత త్వరగా అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోన్ మీద తీవ్రమైన ఒత్తిడి:

మనం కారు డిస్‌ప్లేలో చూస్తున్నా, అసలు ప్రాసెస్ అంతా మన ఫోన్‌లోనే జరుగుతుంది. ఆండ్రాయిడ్ ఆటో రన్ అవుతున్నప్పుడు ఫోన్ జీపీఎస్ ట్రాకింగ్, మ్యాప్స్ లోకేషన్, సాంగ్స్ స్ట్రీమింగ్, వాయిస్ కమాండ్స్ కోసం మైక్రోఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతుంది. ఇవన్నీ ఒకేసారి చేసేసరికి ఫోన్ ప్రాసెసర్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

Advertisement

Also Read: అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

వైర్‌లెస్ కనెక్షన్ ఇచ్చే షాక్:

మనం వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో వాడినప్పుడు సమస్య మరింత పెరుగుతుంది. కేబుల్ లేకుండా కారుకు కనెక్ట్ కావాలంటే ఫోన్ నిరంతరం వై-ఫై డేటాను పంపుతూ ఉండాలి. దీనివల్ల ఫోన్ ఒక హాట్‌స్పాట్‌లా పనిచేసి బ్యాటరీని నీళ్లలా తాగేస్తుంది. అలాగే మనం కారులో వేగంగా వెళ్తుంటున్నప్పుడు, ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ కోసం ఒక టవర్ నుంచి మరో టవర్‌కు మారుతూ సిగ్నల్ పట్టుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఇది కూడా బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ఒక ముఖ్య కారణం.

కారులోని వేడి వాతావరణం:

Advertisement

సాఫ్ట్‌వేర్ పనిభారమే కాకుండా.. కారులో ఉండే వాతావరణం కూడా ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తుంది. ఎండలో కారు నడుపుతున్నప్పుడు డాష్‌బోర్డ్ మీద లేదా ఫోన్ హోల్డర్‌లో పెట్టిన ఫోన్ చాలా వేడెక్కిపోతుంది. ప్రాసెసర్ చేసే పనికి ఫోన్ లోపల ఉన్న వేడికి బయట ఎండ వేడి కూడా తోడవుతుంది. ఈ రెండు కలిసి ఫోన్ బ్యాటరీని చాలా వేగంగా ఖాళీ చేస్తాయి.

ఛార్జింగ్ పెట్టినా సమస్య తీరదు:

చాలామంది బ్యాటరీ అయిపోతుందని కారులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీద ఫోన్ పెడుతుంటారు. కానీ వేడిగా ఉన్న ప్యాడ్ మీద ఫోన్ పెట్టి, అందులో ఆండ్రాయిడ్ ఆటో రన్ చేస్తే ఫోన్ మరింత వేడెక్కుతుంది. ఫోన్ తనను తాను కాపాడుకోవడానికి ఛార్జింగ్ తీసుకోవడం ఆపేస్తుంది. అందుకే ప్రయాణానికి ముందే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకొని, దాన్ని ఎండ తగలకుండా చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది.

Also Read: 13.3 అంగుళాల భారీ డిస్‌ప్లే.. 3 నానోమీటర్ చిప్.. షియోమీ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఇవే!

Tags

Related News

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×