E-Paper
Advertisement

జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!

జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!
Advertisement

Abhinav Reddy and Safira’s Viral Love Story: ప్రయాణంలో కలిసిన ఒక అపరిచిత వ్యక్తి జీవిత భాగస్వామిగా మారడం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ అభినవ్ రెడ్డి జీవితంలో అచ్చంగా ఇలాగే జరిగింది. ‘అభి హనీ’గా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అభినవ్ రెడ్డి, ఇండోనేషియాలోని బాలి పర్యటనలో జర్మనీకి చెందిన ట్రావెలర్ సఫీరాను కలిశారు. ఆ పరిచయం నెమ్మదిగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు నిశ్చితార్థం వరకు చేరింది. ప్రస్తుతం వీరి ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలిలో తొలి పరిచయం

అభినవ్ రెడ్డి, సఫీరా మొదటిసారి బాలిలో కలిశారు. ఇద్దరికీ ట్రావెలింగ్, కొత్త ప్రాంతాలను చూడడం అంటే చాలా ఇష్టం. ఇదే వారిని దగ్గర చేసింది. కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు. బాలి ట్రిప్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోన్ లో మాట్లాడుకునే వాళ్లు. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత సఫీరా జర్మనీలోని తన ఇంటికి అభినవ్‌ ను ఆహ్వానించింది. అభినవ్ అక్కడికి వెళ్లి, ఆ ఊరి అందాలను తన యూట్యూబ్ వీడియోల్లో చూపించాడు. ఆ వీడియోలకు లక్షలాది మంది ప్రేక్షకులు స్పందించారు. ప్రకృతి అందాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సఫీరా ఊరు చూసి ఆశ్చర్యపోయిన అభినవ్

Advertisement

జర్మనీ గ్రామానికి వెళ్లిన అభినవ్ అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మొదట గ్రామ జీవితం చాలా సాధారణంగా ఉంటుందని అనుకున్నానని, కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. సఫీరా తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న ప్రతి ప్రదేశాన్ని అతనికి చూపించింది. తాను చదివిన పాఠశాల, చిన్నప్పుడు ఆడుకున్న ప్రాంతాలు, అడవులు, సరస్సులు, ప్రకృతి అందాలు అన్నింటినీ కలిసి సందర్శించారు. ఇద్దరూ హైకింగ్ చేయడం, సరస్సులో ఈత కొట్టడం, పడవలో ప్రయాణించడం లాంటి ఎన్నో మధురమైన క్షణాలను ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Advertisement

ఈ ట్రిప్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ సఫీరా ఇల్లు. చెక్కతో నిర్మించిన ఆ అందమైన ఇంటిని చూసిన అభినవ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటిని ఆమె తండ్రి ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించారని సఫీరా వివరించింది. తన చిన్ననాటి గది, తోట, చెట్టుపై నిర్మించిన చిన్న ఇల్లు, కూరగాయల తోట, అండర్ గ్రౌండ్ హౌస్ లాంటి ప్రదేశాలను ఆమె చూపించింది. సఫీరా తండ్రి చేసిన కష్టం, కుటుంబంపై ఆయనకున్న ప్రేమ చూసి అభినవ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆయనను తాను చూసిన అత్యుత్తమ తండ్రులలో ఒకరని ప్రశంసించాడు. ఆ ఇల్లు కేవలం ఒక నివాసం మాత్రమే కాదు, కుటుంబ బంధాలకు ప్రతీక అని చెప్పుకొచ్చాడు. అభినవ్ తన వల్లే ట్రావెల్ కంటెంట్ క్రియేషన్‌పై మరింత ఆసక్తి పెరిగిందని సఫీరా చెప్పింది. మరోవైపు, బాలిలో అనుకోకుండా జరిగిన ఒక పరిచయం తన జీవితాన్నే మార్చేసిందని అభినవ్ చెప్పాడు.

సోషల్ మీడియాలో లవ్ స్టోరీ వైరల్

ప్రస్తుతం ఈ జంట నిశ్చితార్థం చేసుకుని తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. త్వరలో భారత్‌కు కూడా రావాలని సఫీరా భావిస్తోంది. బాలిలో మొదలైన ఈ పరిచయం జీవితాంతం కలిసి నడిచే బంధంగా మారడం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ప్రేమకు దేశాలు, భాషలు, సంస్కృతులు అడ్డంకులు కావని ఈ జంట కథ మరోసారి నిరూపించింది.

Read Also: జంగిల్ సఫారీకి రెడీనా? అయితే, మీ కోసమే IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ రెడీ!

Tags

Related News

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

Big Stories

Advertisement
×