E-Paper
Advertisement

High speed Trains: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?

High speed Trains: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?
Advertisement

Indian Railway: భారతీయ రైల్వేపై గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. లక్షల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అప్‌ గ్రేడ్‌ చేస్తోంది. లోకోమోటివ్‌లు, కోచ్‌లు,  రైల్వే ట్రాక్‌ లతో పాటు ప్రతిదీ ఆధునీకరణ చెందుతోంది. రైళ్ల సగటు వేగాన్ని పెంచడం, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను మరింత త్వరగా చేరుకునేలా చూడటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి తగిన ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగానే పాత ICF కోచ్‌లను నెమ్మదిగా కొత్త LHB కోచ్‌లతో భర్తీ చేస్తున్నారు. ఇది ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా వేగాన్ని కూడా మెరుగుపరుస్తుంది. LHB కోచ్‌ లు ఉన్న రైళ్లు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే,  సగటు ఆపరేషనల్ స్పీడ్ ను 160 కిలో మీటర్లకు పరిమితం చేస్తారు.  సాంప్రదాయ ICF కోచ్‌లు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

త్వరలో 16 రైళ్లు వేగం పెంపు   

భారతీయ రైల్వే  తన నెట్‌ వర్క్‌ ను అప్‌గ్రేడ్ చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. సెంట్రల్ రైల్వే పరిధిలోని 16 రైళ్లలో  పాత ICF (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లను ఆధునిక LHB (లింక్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌ లతో రీప్లేస్ చేయబోతోంది.  ప్రయాణీకుల భద్రత, సౌకర్యం, ప్రయాణ ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిర్నం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతీయ రైల్వే ICF కోచ్‌లను తొలగించి, వాటిని LHB మోడళ్లతో భర్తీ చేస్తోంది. అయితే, ఈ కోచ్‌లు మొదట జర్మనీలో తయారు చేశారు. కానీ, ఇప్పుడు ఇండియాలోనూ తయారు చేస్తున్నారు.  స్టెయిన్‌ లెస్ స్టీల్‌ తో.. అధునాతన సాంకేతికతతో వీటిని రూపొందిస్తున్నారు.

పూర్తి LHB కోచ్‌లను అందుకోబోతున్న రైళ్లు   

Advertisement

⦿ 22158 చెన్నై – CSMT ఎక్స్‌ ప్రెస్

⦿ 11088 పూణే – వెరావల్ ఎక్స్‌ ప్రెస్

Advertisement

⦿ 11087 వెరావల్ – పూణే ఎక్స్‌ ప్రెస్

⦿ 11090 పూణే – భగత్ కి కోఠి ఎక్స్‌ ప్రెస్

⦿11089 భగత్ కి కోఠి – పూణే ఎక్స్‌ ప్రెస్

⦿ 11092 పూణే – భుజ్ ఎక్స్‌ ప్రెస్

⦿ 11091 భుజ్ – పూణే ఎక్స్‌ ప్రెస్

⦿ 22186 పూణే – అహ్మదాబాద్ ఎక్స్‌ ప్రెస్

⦿ 22185 అహ్మదాబాద్ – పూణే ఎక్స్‌ ప్రెస్

⦿ 11404 కొల్హాపూర్ – నాగ్‌పూర్ ఎక్స్‌ ప్రెస్

⦿ 11403 నాగ్‌పూర్ – కొల్హాపూర్ ఎక్స్‌ ప్రెస్

⦿ 12147 కొల్హాపూర్ – హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ ప్రెస్

⦿ 12148 హజ్రత్ నిజాముద్దీన్ – కొల్హాపూర్ ఎక్స్‌ ప్రెస్

⦿ 11050 కొల్హాపూర్ – అహ్మదాబాద్ ఎక్స్‌ ప్రెస్

⦿ 11049 అహ్మదాబాద్ – కొల్హాపూర్ ఎక్స్‌ ప్రెస్

ఈ రైళ్లు అన్నీ జనవరి 2026 లోగా కొత్త కోచ్ లతో అత్యాధునిక వేగాన్ని అందుకోబోతున్నాయి. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. LHB కోచ్‌లు భద్రత, వేగానికి ప్రసిద్ధి చెందాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్‌కు వ్యాపించకుండా నిరోధించే యాంటీ క్లైంబింగ్ మెకానిజం వీటిలో ఉంటుంది. అగ్ని నిరోధక పదార్థాలతో నిర్మించబడిన ఇవి.. ఫైర్ యాక్సిడెంట్స్ ను గణనీయంగా తగ్గిస్తాయి. భారతీయ రైల్వేలు 2030 నాటికి అన్ని ICF కోచ్‌లను దశలవారీగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే రాజధాని, శతాబ్ది. దురంతో లాంటి ప్రీమియం రైళ్లు LHB కోచ్‌ లతో నడుస్తున్నాయి.

Read Also: సీటుపై కాలు, చేతిపై ఉమ్మి.. ఇండియన్ ట్రైన్ జర్నీపై యూకే ట్రావెలర్ షాకింగ్ కామెంట్స్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×