E-Paper
Advertisement

Viral Video: సీటుపై కాలు, చేతిపై ఉమ్మి.. ఇండియన్ ట్రైన్ జర్నీపై యూకే ట్రావెలర్ షాకింగ్ కామెంట్స్!

Viral Video: సీటుపై కాలు, చేతిపై ఉమ్మి.. ఇండియన్ ట్రైన్ జర్నీపై యూకే ట్రావెలర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

విదేశీ పర్యాటకులు భారతీయ రైళ్లలో ప్రయాణించిన వారి ఎక్స్ పీరియెన్స్ ను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తారు. పలు దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు వందేభారత్, తేజస్, రాజధాని లాంటి రైళ్లలో ప్రయాణించి తమ అనుభవాలను వెల్లడించారు. కొంత మంది ఇండియన్ రైలు ప్రయాణం అద్భుతం అంటే, మరికొంత మంది తమకు ఎదురైన ఇబ్బందులను కూడా ఎత్తి చూపించారు. అందులో భాగంగానే ఇటీవల ఇండియాకు వచ్చిన ఓ యూకే వ్లాగర్, ఇక్కడి రైలు ప్రయాణం గురించి చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న రెండు రకాల ఇబ్బందులను ఈ వీడియో ప్రస్తావించాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..

ఫారిన్ ట్రావెలర్ షాకింగ్ కామెంట్స్!

బ్యాక్‌ ప్యాకర్ బెన్(@backpacker.ben) అనే యూకే ట్రావెలర్ తాజాగా రైలు ప్రయాణం చేశాడు. ఈ సందర్భంగా ఆయన రెండు విషయాలను ప్రస్తావించాడు. మొదటిది.. తోటి ప్రయాణీకుడు తన సీటుపై కాలు పెట్టడం నచ్చలేదన్నాడు. అలా పెట్టకూడదని అతడికి చాలా సార్లు మర్యాదగా చెప్పినా పట్టించుకోవడం లేదన్నాడు. ఎంత చెప్పినా తను అలాగే చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మరో రెండు గంటల పాటు అతడు సీటు మీద కాలు వేసినా పట్టించుకోకుండా ఉండాల్సిందేనని చెప్పుకొచ్చాడు. రెండోది ఆయన ఈ వీడియో షూట్ చేస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి బుట్టలో కీరాదోస వేసుకుని వచ్చి అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఎవరో ఒక వ్యక్తి ఆ కీరా దోసకాయను నమిలి,  కిటికీలో నుంచి బయటకు ఉమ్మే సమయంలో తన చేతి మీద పడినట్లు చెప్పాడు. తనకు కాస్త చిరాకుగా అనిపించిందని బెన్ ఈ వీడియోలో వివరించాడు.   ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

నెటిజన్లు ఏమంటున్నారంటే?

అటు ఈ వీడియోపై కొందరు పాజిటిల్ గా రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. “మీరు మంచి క్లాస్ టికెట్ కొనుగోలు చేస్తే, ఈ ఇబ్బంది ఉండేది కాదు. టికెట్ కోసం తక్కువ ఖర్చు చేస్తే, ఇలాంటి ఇబ్బందులు తప్పవు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీరు ఆహ్లాదంగా ప్రయాణం చేయాలంటే, వందేభారత్ లాంటి ప్రీమియం రైళ్లను ట్రై చేయడం బెస్ట్” మరో వ్యక్తి సూచించాడు.

అంతకు ముందు మరో వీడియో షేర్ చేసిన బెన్

Advertisement

అటు ఈ వీడియోకు ముందు మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశాడు. హౌస్ కీపింగ్ సిబ్బంది రైలులో చెత్తను ఊడ్చి, కదులుతున్న కోచ్ నుంచి నేరుగా రైల్వే ట్రాక్‌ పైకి నెట్టివేస్తున్నట్లు చూపించారు. బాటిళ్లు, పేపర్లు, ఇతర వ్యర్థాలను ఇలా పడేయడాన్ని చూసి ఆయన షాకయ్యాడు. ముఖ్యంగా సఫాయి కార్మికుడు అతడు వీడియో తీస్తున్నట్లు గమనించినా, తన పని తాను చేసుకుపోయాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రైల్వే అధికారులు పరిశుభ్రతా ప్రమాణాలను మెరుగు పరచాల్సిన అవసం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Read Also: రైలు ఎక్కుతుండగా మహిళను అక్కడ పట్టుకున్న ఆకతాయి, పోలీసులు ఏం చేశారంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×