E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలు – బంధువులతో గొడవలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ప్రయాణాలు – బంధువులతో గొడవలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 25వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభం

Advertisement

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. 

మిథునం

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

కర్కాటకం

Advertisement

దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

కన్య

మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చికం

చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు

ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

మీనం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×