E-Paper
Advertisement

New Tirupati-Shirdi Express: పట్టాలెక్కిన తిరుపతి-షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్..

New Tirupati-Shirdi Express: పట్టాలెక్కిన తిరుపతి-షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్..
Advertisement

New Tirupati-Shirdi Express: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడికి రైలు మార్గం ద్వారా ఎక్కువగా భక్తులు వస్తుంటాయి. అయితే తాజాగా ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన షిర్డీ, తిరుపతి ప్రాంతాలను కలుపుతూ ఒక కొత్త రైలు సర్వీసు మొదలైంది. ఈ కొత్త రైలు పేరు తిరుపతి–సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు మొదలవడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చాలా సులభం కానుంది. ముఖ్యంగా.. భక్తులు షిర్డీ, తిరుపతి ఈ రెండు పుణ్యక్షేత్రాలకు సులభంగా వెళ్లగలుగుతారు. ఈ కొత్త రైలు సేవను డిసెంబర్ 9న కేంద్రమంత్రి ప్రారంభించారు.

ప్రారంభోత్సవం:
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి-షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సేవలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు రెవెన్యూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు , సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సేవ ముఖ్యంగా ఏపీ.. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ప్రయాణించే లక్షలాది మంది భక్తులకు, సాధారణ ప్రయాణీకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రధాన జంక్షన్లు:
ఈ రైలు ప్రయాణీకులకు సౌలభ్యం కల్పించడానికి పలు ముఖ్యమైన జంక్షన్లను కలుపుతూ వెళ్తుంది. వాటిలో కొన్ని..

Advertisement

గూడూరు

గుంటూరు

సికింద్రాబాద్

వికారాబాద్

శంభాజీనగర్ (ఔరంగాబాద్)

మన్మాడ్

ఈ కనెక్టివిటీ కారణంగా.. ఈ ప్రాంతాల మధ్య పర్యాటక రంగం, వ్యాపార ప్రయాణాలు గణనీయంగా మెరుగుపడతాయని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కోచ్‌లు, సౌకర్యాలు:
ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆధునిక ఎల్.హెచ్.బి కోచ్‌లను కేటాయించారు. ఈ రైలులో వివిధ తరగతుల కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఏసీ 2 టైర్ (2AC)

స్లీపర్ క్లాస్ (Sleeper)

జనరల్ కోచ్‌లు (General)

Also Read: హైదరాబాద్‌లోని.. ఈ ఫేస్‌లను చూడకపోతే చాలా మిస్సవుతారు !

ప్రత్యేక సేవలు:

ప్రారంభం (రైలు నెం. 07425/07426): డిసెంబర్ 9, 10, 2025 తేదీల్లో నడిచింది.

రైలు నెం. 07425: డిసెంబర్ 9వ తేదీన ఉదయం 11:10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరింది.

రైలు నెం. 07426: డిసెంబర్ 10వ తేదీన రాత్రి 10:20 గంటలకు షిర్డీ నుంచి బయలుదేరింది.

సాధారణ వీక్లీ  ట్రైన్ (రైలు నెం. 17425/17426): డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది.

రైలు నెం. 17425: ప్రతి ఆదివారం ఉదయం 4:00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.

రైలు నెం. 17426: ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు సాయి నగర్- షిర్డీ నుంచి బయలుదేరుతుంది.

ఈ కొత్త రైలు సేవ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×