E-Paper
Advertisement

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్.. రైల్వేశాఖ సంచలన నిర్ణయం!

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్.. రైల్వేశాఖ సంచలన నిర్ణయం!
Advertisement

24-Coach Vande Bharat Sleeper Train: రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా అందుబాటులోకి ఈ రైలుకు 16 కోచ్‌లు ఉన్నాయి. 823 బెర్త్‌ ల సామర్థ్యం కలిగి ఉంది. అయితే, ప్రయాణీకుల నుంచి  డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. మరిన్ని కోచ్ లతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై కొత్త  రైళ్లలో 24 కోచ్ లు ఉంటాయి. 1,224 బెర్త్‌ లు ఉంటాయి. హౌరా-కామాఖ్య మార్గంలోని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రైలుకు సంబంధించి అధికారులు ప్రయాణీకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం ప్యాంట్రీ కార్‌ తో 24 కోచ్ ల వందేభారత్ స్లీపర్ రైలును తయారు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

డిజైన్ దశలో 24 కోచ్ ల వందేభారత్ స్లీపర్

24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రోటోటైప్ రేక్‌ ను 2026 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విస్తరించిన కాన్ఫిగరేషన్ ప్రయాణీకుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు ఆన్‌ బోర్డ్ సేవలను, సుదూర రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు ప్రతిపాదిత కోచ్ కూర్పులో 17 AC 3 టైర్ కోచ్‌లు, ఐదు AC 2 టైర్ కోచ్‌లు, ఒక AC ఫస్ట్ క్లాస్ కోచ్, ఒక ప్రత్యేక AC పాంట్రీ కారు ఉన్నాయి.

అత్యాధునిక ఫీచర్లతో

Advertisement

కొత్త రైల్లో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుదూర ప్రయాణాలలో క్యాటరింగ్ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పూర్తి స్థాయి AC పాంట్రీ కారును తీసుకొచ్చారు. సమర్థవంతమైన సర్వీస్ డెలివరీని నిర్ధారించడానికి కోచ్‌లలో మినీ- ప్యాంట్రీ యూనిట్లు, లినెన్ స్టోర్ ప్లేసెస్ ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణీకుల కోసం ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన బెర్త్‌ లు, పర్సనల్ రీడింగ్ లైట్లు, మొబైల్, ల్యాప్‌ టాప్ ఛార్జింగ్ పాయింట్లు, Wi-Fi-ఎనేబుల్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, వాక్యూమ్ అసిస్టెడ్ టాయిలెట్లు, మెరుగైన లగేజ్ స్పేస్, ఆధునిక ఇంటీరియర్ ఫిట్టింగ్స్ ఉంటాయి. దివ్యాంగ ప్రయాణీకుల కోసం టాయిలెట్లు, ర్యాంప్ లు లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ ట్రైన్‌ సెట్‌ లో అధునాతన ప్రొపల్షన్, కంట్రోల్ సిస్టమ్‌లు, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, అత్యాధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రాష్‌ వర్టీ స్టెయిన్‌ లెస్ స్టీల్ కార్ బాడీతో రూపొందించారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు, CCTV నిఘా, రైళ్లు ఢీకొనకుండా కవచ్ వ్యవస్థను ఇన్ స్టాల్ చేశారు. 160 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయానించే ఈ రైల్లో ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్‌లు, మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ ఉంటాయి. ఇది రాత్రిపూట ప్రయాణ అనుభవాన్ని సున్నితంగా, నిశ్శబ్దంగా ఉండేలా చేస్తుంది.

Advertisement

Read Also:  ఆ రైళ్లలోకి పిల్లల నో ఎంట్రీ, దుమారం రేపుతున్న ఫ్రెంచ్ రైల్వే నిర్ణయం!

Related News

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

Big Stories

Advertisement
×