Dhurandhar Movie Review : ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా పడటం వల్ల ఇప్పుడు అందరి కళ్ళూ ధురంధర్ పై పడ్డాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సినిమా ఇది. ట్రైలర్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా చూడాలని చాలా మంది ఆడియన్స్ ఫిక్సయినట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. మరి వారు ఆశపడిన రేంజ్ కంటెంట్ ఈ సినిమాలో ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
గతంలో భారత్ లో జరిగిన కొన్ని వాస్తవిక టెర్రరిస్ట్ ఎటాక్..ల నుండి స్ఫూర్తినొంది తెరకెక్కించిన సినిమా ఇది. 1999 IC 814 హైజాక్, అలాగే 2001 లో జరిగిన ఇండియన్ పార్లమెంట్ ఎటాక్..లు దేశాన్ని కుదిపేస్తాయి. దీంతో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ డేంజరస్ మెషిన్ ని ప్లాన్ చేస్తాడు. దాని ద్వారా శత్రుదేశానికి గుణపాఠం చెప్పడంతో పాటు అండర్ వరల్డ్ ను నామరూపాలు లేకుండా చేయాలనేది అనేది అతని ఆలోచన.
ఈ మిషన్ ఏంటంటే.. తన దేశానికి చెందిన ధైర్య సాహసాలు గల ఓ ఏజెంట్ ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్యాంగ్లో చేర్చడం. తద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టుల క్రూరమైన ఆలోచనలు తెలుసుకుని.. ఆ ఏజెంట్ ద్వారా వారి ప్లాన్స్ ను స్పాయిల్ చేసి భారత్ కి రక్షణ కలిగించడం అనేది సన్యాల్ ముఖ్య ఉద్దేశం. దీని కోసం హమ్జా అలీ మజారీగని (రణ్వీర్ సింగ్) ఎంపిక చేసుకుంటాడు. మరి అజయ్ సన్యాల్ మెషిన్ ను హమ్జా అలీ సమర్థవంతంగా నిర్వర్తించాడా? లేదా? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? హమ్జా అలీకి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
బాలీవుడ్లో రూపొందే స్పై జోనర్ సినిమాలు చాలా వరకు ఒకేలా ఉంటాయనే విమర్శ ఎప్పటినుండో ఉంది. ‘రాజి’ వంటి ఒకటి రెండు సినిమాలు తీసేస్తే.. ఇది నిజమని చాలా మంది పేర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ ‘దురంధర్’ని ట్రూ ఇన్సిడెంట్స్ తో అందరూ రిలేట్ అయ్యే విధంగా చేసుకుని రియాలిటీకి దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దాడు. కానీ అక్కర్లేని సన్నివేశాలు బోలెడన్ని పెట్టేసి… సాగదీశాడు. నిడివి దాదాపు మూడున్నర గంటలు ఉంది.
కంటెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటే నిడివితో ఎటువంటి సమస్య ఉండదు. కానీ పాకిస్తాన్ అండర్‌వరల్డ్, గ్యాంగ్ వార్లు పేర్లు చెప్పి వయొలెన్స్ డొసేజ్ ను చాలా గట్టిగా దట్టించాడు. కొన్ని సన్నివేశాలు చూస్తే.. ఓటీటీల్లో వచ్చిన ఎన్నో సెన్సిటివ్ కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్..లు కళ్ళముందుకు వస్తాయి. కొన్ని సన్నివేశాలు అయితే సందీప్ రెడ్డి వంగా తీసిన రణబీర్ కపూర్ యానిమల్ ను గుర్తుచేస్తాయి. వాటినే కాపీ కొట్టేశారు అని కామెంట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నటీనటుల విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ చాలా ఇంటెన్సిటీతో నటించాడు. యాక్షన్ సీన్స్ లో చాలా యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేశాడు. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కొన్ని సన్నివేశాల్లో ‘యానిమల్’ హీరో రణబీర్ కపూర్లా కనిపించాడు అనడంలో సందేహం లేదు.
సారా అర్జున్ పాత్రకి పెద్దగా స్కోప్ లేని సినిమా ఇది. ఏదో ఉంది అంటే.. ఉంది అంతే. ఇక మిగిలిన నటీనటుల్లో మాధవన్ మేకోవర్ కొత్తగా ఉంది. పాత్రలో కూడా ఒదిగిపోయాడు. అతని కెరీర్లో మరో బెస్ట్ రోల్ ఇది. అలాగే అక్షయ్ ఖన్నా కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్ పాత్ర పెద్దగా పండలేదు.
రణ్వీర్ సింగ్
ఫస్ట్ హాఫ్
మాధవన్
యాక్షన్ సీన్స్
సెకండాఫ్
నిడివి
వయొలెన్స్
మొత్తంగా ‘ధురంధర్’ డౌట్ లేకుండా రన్ టైంకి సరెండర్ అయ్యి చూడాల్సిన సినిమా. అంచనాలు ఎక్కువ పెట్టుకోకుండా ఓపిక ఉంటేనే థియేటర్ కి వెళ్ళాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ సినిమాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.