E-Paper
Advertisement

కాంగ్రెస్‌ను ఎదుర్కొందాం.. కేసీఆర్ నినాదంతో ముందుకెళ్దాం.. కేడర్‌కు కేటీఆర్ పిలుపు!

కాంగ్రెస్‌ను ఎదుర్కొందాం.. కేసీఆర్ నినాదంతో ముందుకెళ్దాం.. కేడర్‌కు కేటీఆర్ పిలుపు!
Advertisement

KTR vs Congress: కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలను అడుగడుగునా ఎదుర్కొందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఆయన నిర్వహించారు. అనంతరం ట్యాంక్ బండ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2024 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ ని బందీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడ్ని సంకెళ్లలో పెట్టి ఎవరినీ వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ బంధించిందని ఆరోపించారు.

అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనేది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1000 గురుకుల పాఠశాలలు నిర్మించిందని గుర్తుచేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ ను ఎంతగానో ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు.

Advertisement

మరోవైపు కేసీఆర్ దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్కీమ్ కి ‘అంబేద్కర్ అభయహస్తం’ అని పేరు పెట్టిందన్నారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు తేవాలంటే నాయకుడికి ‘ఖలేజా’ ఉండాలని అది కేసీఆర్ కు ఉందని ప్రశంసించారు. అటు కాంగ్రెస్ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు.

Also Read: Heatwave Alert: ఎండలో బయటకు రావొద్దు.. నెత్తిన తలపాగ పెట్టుకోండి.. మంత్రి సీతక్క విజ్ఞప్తి

Advertisement

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత.. మే, జూన్ నెలల్లో ఎక్కడో ఒక దగ్గర ఎస్సీ, ఎస్టీల కోసం సభలు ప్రారంభిద్దామని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా కాంగ్రెస్ చేసిన ప్రామిస్‌ల మీద పకడ్బందీగా పోరాడాలన్నారు. మరోవైపు కేసీఆర్ 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్‌కు పెట్టారని, పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాబట్టి జై కేసీఆర్ నినాదంతో ముందుకు సాగుదామని కేడర్ కు పిలుపునిచ్చారు.

Also Read: Airtel బెస్ట్ 30 డేస్ ప్లాన్స్.. 60GB డేటా, అపరిమిత కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్స్!

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×