E-Paper
Advertisement

రూ. 49 లక్షలు పెట్టి టిక్కెట్లు కొన్నా, విమానం ఎక్కనివ్వని సిబ్బంది..అసలేం జరిగిందంటే?

రూ. 49 లక్షలు పెట్టి టిక్కెట్లు కొన్నా, విమానం ఎక్కనివ్వని సిబ్బంది..అసలేం జరిగిందంటే?
Advertisement

KLM Under Fire for Boarding Denial Incident: బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు న్యాయస్థానం ముందుకు చేరింది. ఎనిమిది మంది సభ్యులున్న ఒక కుటుంబం అంతర్జాతీయ యాత్ర కోసం సుమారు రూ. 49 లక్షలు ఖర్చు చేసి టిక్కెట్లు కొనుగోలు చేసింది. కానీ, చివరి నిమిషంలో సిబ్బంది విమానం ఎక్కనివ్వకపోవడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక న్యాయస్థానం కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌ లైన్స్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తమిళనాడులోని సేలం నగరానికి చెందిన మెడికల్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ జె.ఎస్. సతీష్‌ కుమార్ కుటుంబానికి ఈ ఘటన ఎదురయ్యింది. ఆయన తన ఫ్యామిలీతో కలిసి పెరూ దేశానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. 2024 జూన్ 19న బెంగళూరు నుండి బయలుదేరే కేఎల్‌ఎం విమానానికి ఎనిమిది బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీటి మొత్తం ఖర్చు దాదాపు రూ. 49 లక్షలు. తిరుగు ప్రయాణం కోసం జూలై 3న టిక్కెట్లు కూడా ముందుగానే బుక్ చేశారు. ప్రయాణ రోజున కుటుంబ సభ్యులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని అవసరమైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. అయితే, చెక్ ఇన్ కౌంటర్ దగ్గర చాలా సేపు వేచి ఉంచిన తర్వాత, విమానం బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు వారిని బోర్డింగ్‌కు అనుమతించబోమని ఎయిర్‌ లైన్ సిబ్బంది తెలిపారు. పెరూ వీసా లేకపోవడం వల్లే అనుమతించడం లేదని వెల్లడించారు.

 విమాన సంస్థపై సతీష్ ఆగ్రహం

Advertisement

విమనా సంస్థ చెప్పిన కారణంపై సతీష్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్, యుకే, ఆస్ట్రేలియా, షెంగెన్ దేశాల వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయులు ప్రత్యేక పెరూ వీసా లేకుండానే ఆ దేశంలోకి వెళ్లవచ్చని ఆయన తెలిపారు. ఎయిర్‌లైన్ సిబ్బంది ఈ నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. ఎయిర్‌ లైన్ నిర్ణయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత తమ కుటుంబాన్ని రెడ్ ఫ్లాగ్ చేశారని సతీష్‌కుమార్ ఆరోపించారు. దీని వల్ల వారి అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. సింగపూర్‌ లో ఆయన కుమారుడిని ఆపి, పెరూ నుండి బహిష్కరణకు గురయ్యాడనే అనుమానంతో ప్రశ్నించారు. అలాగే ఆస్ట్రేలియాకు వెళ్లేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.

కోర్టును ఆశ్రయించిన సతీష్ కుమార్

ఈ నేపథ్యంలో సతీష్‌కుమార్ కోర్టును ఆశ్రయించగా, బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి కోర్టు ఈ కేసును పరిశీలించి, కేఎల్‌ఎం సంస్థ సీఈఓ, సీఓఓతో పాటు ఇతర సీనియర్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్, ప్రయాణికులు సరైన పత్రాలతో ప్రయాణించడం వారి బాధ్యత అని తెలిపింది. అన్ని ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే, ఈ ఘటన వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా వెల్లడించింది. ఈ సంఘటన విమానయాన సంస్థల బాధ్యతలు, ప్రయాణికుల హక్కులు, అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై స్పష్టత అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Advertisement

Read Also: దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×