E-Paper
Advertisement

Viral News: ఇతడు 1998 నుంచి నడుస్తూనే ఉన్నాడు.. 2026 నాటికి ఇంటికి చేరే ఛాన్స్, ఎందుకలా?

Viral News: ఇతడు 1998 నుంచి నడుస్తూనే ఉన్నాడు.. 2026 నాటికి ఇంటికి చేరే ఛాన్స్, ఎందుకలా?
Advertisement

Karl Bushby Long Walk: ప్రపంచాన్ని కాలి నడకతో చుట్టేయాలి. ఊహించుకుంటేనే షాకింగ్ గా ఉంది కదా? కార్ల్ బుష్బీ అనే వ్యక్తి ఇదే తన గోల్ గా మలుచుకున్నాడు. చిలీలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.  ప్రపంచం అంతా చుట్టేసి ఇంగ్లాండ్ కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రెండున్నర దశాబ్దాలకు పైగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, గడ్డకట్టిన జలసంధుల గుండా తన ప్రయాణం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30 వేలకు పైగా మైళ్లు నడిచాడు. 2026 చివరల్లో తన గమ్యస్థానానికి చేరుకోబోతున్నాడు. ఇంతకీ కార్ల్ బుష్బీ ఎవరు? అతడి నేపథ్యం ఏంటి?

1998లో కార్ల్ బుష్బీ ప్రపంచ యాత్ర ప్రారంభం   

కార్ల్ బుష్బీ ఓ బ్రిటీష్ మాజీ పారా ట్రూపర్. లండన్ లోని హల్ తన స్వస్థలం. 1998లో దక్షిణ చిలీ నుంచి తన ప్రపంచ నడక యాత్రను మొదలు పెట్టాడు. దారిలో ఏ వాహనాన్ని ఎక్కకుండా తన గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకున్నాడు. అతడు తన ప్రయాణాన్ని గోలియత్ సాహసయాత్రగా పిలుచుకున్నాడు. మొత్తం 58,000 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 8 నుంచి 12 సంవత్సరాలలో పూర్తి చేయాలని భావించాడు. కానీ, 27 సంవత్సరాలకు పైగా కొనసాగుతూనే ఉంది. వీసా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, COVID-19, రాజకీయ అడ్డంకుల వల్ల ఆలస్యమైంది.

2026లో యాత్ర పూర్తయ్యే అవకాశం

Advertisement

కార్ల్  ఇప్పటి వరకు 31,000 మైళ్లకు పైగా నడిచాడు. అంటే దాదాపు 50,000 కిలోమీటర్లు. ఈ యాత్రలో భాగంగా అతడు  ఎడారులు, అడవులు, ఎత్తైన పర్వతాలతో పాటు కఠినమైన ప్రాంతాల గుండా తన నడక కొనసాగించాడు. అనేక దేశాల గుండా వెళ్ళాడు. తీవ్రమైన వేడి, చలి, వర్షం, మంచు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం యూరప్‌లో ఉన్నాడు.  హంగేరీ, రొమేనియా ప్రాంతాల్లో నడుస్తున్నాడు. మిగిలిన దూరం సుమారు మరో 1,500 మైళ్లు (2,200 కి.మీ) నడిస్తే తన గమ్యస్థానం చేరుకుంటాడు. 2026 సెప్టెంబర్, అక్టోబర్ నాటికి లండన్ లోని హల్ చేరుకుంటానని భావిస్తున్నాడు.

యాత్రలో ఎదురైన ముఖ్యమైన సవాళ్లు

⦿ కొలంబియా- పనామా మధ్య ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ అడవి గుండా నడిచాడు. ఇందుకోసం ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది.

Advertisement

⦿ 2006లో అలాస్కా- రష్యా మధ్య ఘనీభవించిన బేరింగ్ జలసంధిని కాలినడకన దాటాడు.14 రోజుల్లో ఒక ఫ్రెంచ్ స్నేహితుడితో కలిసి దీన్ని దాటాడు.

⦿ రష్యాలో, సరైన పత్రాలు లేకుండా ప్రవేశించినందుకు అధికారులు అతన్ని ఆపారు. కొనసాగడానికి అనుమతి కోసం అతను చాలా సంవత్సరాలు వేచి ఉన్నాడు.

⦿ 2024లో, కొన్ని దేశాల వీసాలు పొందలేకపోయాడు. కాబట్టి అతను కజకిస్తాన్ నుంచి అజర్‌బైజాన్‌కు కాస్పియన్ సముద్రం దాటి ఈదాడు. దీనికి 31 రోజులు పట్టింది.

⦿ మే 2025లో టర్కీ నుండి యూరప్‌ లోకి నడిచాడు.

⦿ డిసెంబర్ 2025 నాటికి, హంగరీ, రొమేనియా, స్లోవేకియా వంటి దేశాల గుండా నడుస్తున్నాడు.

⦿ 2026 చివరిలో ఇంగ్లాండ్‌ లోని హల్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×