E-Paper
Advertisement

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!
Advertisement

Nalgonda Tourist Places: తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా చారిత్రక వారసత్వం, ప్రాచీన దేవాలయాలు, ప్రకృతి సోయగాలు, అద్భుతమైన ఇంజినీరింగ్ నిర్మాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్ కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఈ జిల్లా అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ప్రదేశం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

నాగార్జునసాగర్: ఇంజినీరింగ్ అద్భుతం

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వర్షాకాలంలో ఆనకట్ట గేట్లు ఎత్తినప్పుడు కృష్ణా నది ఉప్పొంగుతూ కనిపించే దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రాంతం ఫోటోగ్రఫీకి బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.

నాగార్జునకొండ, బుద్ధవనం

Advertisement

సాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు బోటులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణమే ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అక్కడి మ్యూజియంలో బౌద్ధమతానికి చెందిన పురాతన శిల్పాలు, చారిత్రక అవశేషాలు దర్శనమిస్తాయి. సమీపంలోని బుద్ధవనం కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బౌద్ధ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

పానగల్లు ఆలయాల ప్రత్యేకత

పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయం తన అద్భుత నిర్మాణ శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. శివలింగంపై ఎప్పుడూ ఒకే విధంగా నీడ పడటం ఈ ఆలయ ప్రత్యేకత. సమీపంలోని పచ్చల సోమేశ్వరాలయంలో కాకతీయుల శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంది. రామాయణం, మహాభారతంలోని అనేక ఘట్టాలను రాతిపై అద్భుతంగా చెక్కారు.

వాడపల్లి, చెర్వుగట్టు ఆలయాలు

Advertisement

కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఉన్న వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. స్వామివారి ముందు వెలిగే దీపం నిరంతరం కదులుతూ ఉండటం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయం కూడా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.

దేవరకొండ, రాచకొండ కోటలు

చరిత్రను ఇష్టపడే వారికి దేవరకొండ కోట తప్పక చూడాల్సిన ప్రదేశం. కొండల మధ్య నిర్మించిన ఈ గిరిదుర్గం అప్పటి రాజుల సైనిక వ్యూహాలకు నిదర్శనం. మరోవైపు రాచకొండ కోట ప్రకృతి మధ్యలో ఉండటంతో ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా నిలుస్తోంది.

Read Also: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

ఎప్పుడు వెళ్తే బాగుంటుందంటే?   

నల్లగొండ జిల్లాను సందర్శించేందుకు జూలై నుంచి మార్చి వరకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో అన్ని ప్రదేశాలను ప్రశాంతంగా సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు రోడ్డు, రైలు మార్గాల్లో మంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు ఒకే జిల్లాలో ఆస్వాదించాలని భావించే వారికి నల్లగొండ నిజంగా ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఒక్కసారి వెళ్లినవారు మళ్లీ వెళ్లాలని అనిపించేలా ఈ ప్రాంతం ప్రతి సందర్శకుడిని ఆకట్టుకుంటుంది.

Read Also: అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×