Airport Luggage Door Step Check In| విమాన ప్రయాణం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది భారీ లగేజీ, ట్రాఫిక్, చెక్ ఇన్ కౌంటర్లు, పొడవైన క్యూలు. అయితే బెంగళూరు నుంచి ప్రయాణించే వారికి త్వరలో ఈ అనుభవం మరింత సులభంగా మారవచ్చు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం ఇంటి నుంచే ప్రారంభమయ్యే ప్రత్యేక సేవను ప్లాన్ చేస్తోంది. లగేజీ పికప్ నుంచి చౌఫర్ కార్ వరకు అనేక ప్రీమియం సదుపాయాలు అందుబాటులోకి తీసుకురాబోతోంది.
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తన ‘Care by BLR’ కార్యక్రమం ద్వారా హోమ్ చెక్ ఇన్ సర్వీస్ ప్రతిపాదిస్తోంది. ఈ సేవ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు భారీ సూట్‌కేసులను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాల్సిన భారం తగ్గిపోతుంది. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికుల ఇంటికి వచ్చి చెక్ ఇన్ లగేజీని సేకరించే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు తేలికగా, సౌకర్యంగా విమానాశ్రయానికి వెళ్లగలరు. అయితే ఈ సేవ ప్రారంభ తేదీని విమానాశ్రయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రతిపాదిత Care by BLR సేవ కేవలం లగేజీ సేకరణకే పరిమితం కాకపోవచ్చు. ప్రయాణికులకు సమయానికి సిద్ధం కావడానికి వేక్-అప్ కాల్ కూడా అందించే అవకాశం ఉంది. సిబ్బంది ఇంటికి వచ్చి లగేజీని తీసుకున్న తర్వాత చౌఫర్‌తో (డ్రైవర్) కూడిన కార్ సేవ అందుబాటులో ఉండవచ్చు. దీంతో ఇంటి నుంచి విమానాశ్రయం వరకు ఫుల్ డోర్ టు డోర్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా సిబ్బంది అవసరమైన ప్రక్రియల్లో సహాయం చేస్తారు. ఇది ముఖ్యంగా వృద్ధులు, కుటుంబాలు, తరచుగా ప్రయాణించే వారికి ఉపయోగపడవచ్చు.
విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద అనుమతి లేని వస్తువులను చాలాసార్లు ప్రయాణికులు వదిలివేయాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా బెంగళూరు విమానాశ్రయం కొరియర్ సేవను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హత ఉన్న వస్తువులను ప్రయాణికులు తమకు నచ్చిన అడ్రస్‌కు పంపించే అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యమైన వస్తువులను సెక్యూరిటీ వద్ద శాశ్వతంగా వదిలివేయాల్సిన పరిస్థితి తగ్గవచ్చు. అయితే ఏ వస్తువులకు ఈ సేవ వర్తిస్తుందో ఇంకా స్పష్టత లేదు. కొరియర్ ఛార్జీలు, సర్వీస్ ప్రారంభ వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రయాణికులకు మరింత వ్యక్తిగతమైన సేవలను అందించాలని భావిస్తోంది. ఈ ప్రణాళికలో ఇంటి వద్ద లగేజీ పికప్ మరియు హోమ్ చెక్ ఇన్ ఉండవచ్చు. ప్రయాణికులు లిమోసిన్ లేదా చౌఫర్ కార్లలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం కూడా ఉంది. బోర్డింగ్ గేట్ వద్ద ఆహారాన్ని అందించే సేవలను కూడా ప్రణాళికలో భాగంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రయాణికులకు లాంజ్ యాక్సెస్ అర్హత ఉందా? లేదా? అని తెలుసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది.
Also Read: అధిక వడ్డీ చూసి బాండ్స్ కొనకండి.. పెట్టుబడిదారులు చేసే 5 తప్పులు ఇవే
హోమ్ చెక్-ఇన్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ ప్రీమియం ట్రాన్స్‌ఫర్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు బెంగళూరు నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు హై ఎండ్ కార్లను బుక్ చేసుకోవచ్చు. బిఎండబ్లూ, ఆడి, మర్సిడీస్, రోల్స్ రాయస్ వంటి లగ్జరీ కార్ల ఎంపికలు ఉన్నట్లు సమాచారం. ఎంచుకునే కారు, ప్రయాణ దూరం మరియు బుకింగ్ సమయాన్ని బట్టి ధరలు మారుతాయి. ప్రీమియం లిమోసిన్ ట్రాన్స్‌ఫర్లు సుమారు రూ.4,500 నుంచి ప్రారంభమవుతున్నట్లు సమాచారం. అత్యంత లగ్జరీ ప్రయాణం కోరుకునేవారికి రోల్స్ రాయ్స్ ట్రాన్స్‌ఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ ప్రారంభ ధర సుమారు రూ.50,000 ఉంటుంది.
డోర్‌స్టెప్ చెక్ ఇన్ సర్వీస్ ప్రస్తుతం ప్రతిపాదన లేదా అభివృద్ధి దశలో ఉంది. అందుబాటు, ధరలు, ప్రారంభ తేదీ కోసం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. లగేజీ సేకరణ మరియు సెక్యూరిటీ నిబంధనలపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అయితే ఈ ప్రణాళిక భవిష్యత్తులో విమాన ప్రయాణాన్ని మరింత సులభంగా మారబోతోంది.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ ఇంటి గడప నుంచే ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభించే కొత్త ఆలోచనను పరిశీలిస్తోంది. డోర్‌స్టెప్ చెక్ ఇన్, లగేజీ పికప్, చౌఫర్ సేవలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. అయితే ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు