E-Paper
Advertisement

నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?

నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?
Advertisement

Nagarjuna Sagar Water Turns Green: నాగార్జునసాగర్‌ లో నీటి రంగు ఒక్కసారిగా మారడం కలకలం రేపుతోంది. సాధారణంగా కనిపించే నీరు ఇప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. నీటిలో ఏదైనా రసాయన పదార్థాలు కలిశాయా? లేదంటే సహజంగా చోటుచేసుకున్న మార్పేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నీటి రంగులో మార్పు!

నాగార్జున సాగర్ బ్యాక్‌ వాటర్‌ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నీరు స్పష్టంగా రంగు మారినట్లు కనిపిస్తోంది. నీటి అంచుల్లో ఉన్న గడ్డి కూడా ఎండిపోయినట్టుగా కనిపించడంతో స్థానికుల అనుమానాలు మరింత పెరిగాయి. నీటిలోకి ఏదైనా కలుషిత పదార్థం చేరి ఉంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే, నీటి రంగు మారడానికి కారణం ఏమిటనేది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.

తాగునీటికి కీలక ఆధారం

Advertisement

నాగార్జునసాగర్ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ నగరానికి కూడా తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక ప్రాంతాలు కూడా సాగర్ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ జలాశయం నుంచి నీటి అవసరాలు తీరుతున్నాయి. అందుకే నీటి నాణ్యతకు సంబంధించి చిన్న అనుమానం వచ్చినా ప్రజల్లో సహజంగానే ఆందోళన నెలకొంటోంది.

సాగర్ వాటర్ లో విష రసాయనాలు కలిశాయా?

శ్రీశైలం వైపు నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే నీటి ప్రవాహ మార్గంలో ఎక్కడైనా విష రసాయన పదార్థాలను పారబోసి ఉండొచ్చని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ ఫ్లోతో అవి సాగర్‌లోకి చేరి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే, ఇది ప్రస్తుతం కేవలం అనుమానం మాత్రమే. నీటి పరీక్షల ఫలితాలు వచ్చే వరకు రసాయన కాలుష్యమే కారణమని చెప్పే అవకాశం లేదు.

అధికారుల పరీక్షలే కీలకం!

Advertisement

గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. నీటిలో ఏం మార్పు చోటుచేసుకుందో తెలుసుకోవాలంటే సంబంధిత అధికారులు వెంటనే నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాల్సిన అవసరం ఉంది. రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాలు ఉన్నాయా? అనే విషయం పరీక్షల్లో తేలాల్సి ఉంది. ఒకవేళ కలుషితం ఉన్నట్లు నిర్ధారణ అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన

ఇప్పటికే పారిశ్రామిక కాలుష్యంతో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్న ఘటనలు  ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగర్‌ నీటి రంగు మారడం ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిపై ఊహాగానాలు చేయడం కంటే శాస్త్రీయ పరీక్షల ద్వారా నిజానిజాలు బయటపెట్టడం ముఖ్యం. సాగర్‌ నీరు తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. సాగర్‌ లో నిజంగా ఏం జరిగింది? సహజ మార్పా? కాలుష్యమా? అధికారుల నీటి పరీక్షల ఫలితాలే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.

గమనిక: ఫోటో రిప్రజెంటేషన్ కోసం ఏఐలో క్రియేట్ చేశాం గమనించగలరు.  

Read Also: అడవిలో దాగిన 1,500 ఏళ్ల అద్భుతం.. తెలంగాణ ఆంగ్‌కోర్ వాట్ ఆలయం గురించి మీకు తెలుసా?

Tags

Related News

నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నల్లగొండ, ఏకంగా సెకెండ్ ప్లేస్ కైవసం!

ఎయిర్‌పోర్ట్‌కు లగేజ్ తీసుకెళ్లడం ఇక అవసరం లేదు.. ఇంటి వద్దనే చెక్ ఇన్ సర్వీస్

మ్యూజియంలో ఉండాల్సిన ట్రైన్ మళ్లీ పట్టాలపైకి.. 63 ఏళ్ల ఈ రైలుకు ఇప్పటికీ ఇంత డిమాండా?

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఇల్లు.. లోపల సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే?

దీపావళి రైలు టికెట్ల బుకింగ్ షురూ.. కన్ఫర్మ్ బెర్త్ కావాలంటే ఈ డేట్ మిస్ కావొద్దు!

అడవిలో దాగిన 1,500 ఏళ్ల అద్భుతం.. తెలంగాణ ఆంగ్‌కోర్ వాట్ ఆలయం గురించి మీకు తెలుసా?

ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన విమానం.. ఐదుగురు మృతి, 250 విమాన సర్వీసులపై ప్రభావం

Big Stories

Advertisement
×