E-Paper
Advertisement

Sankranti Special Trains: హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు.. సగానికి పైగా జనరల్ బోగీలు

Sankranti Special Trains: హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు.. సగానికి పైగా జనరల్ బోగీలు
Advertisement

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా మరిన్ని అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాటు చేసింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.

1. 07473- హైదరాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్- 11.01.2026 & 12.01.2026
2. 07474 – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ -10.01.2026 & 11.01.2026
3. 07475 – హైదరాబాద్ టు విజయవాడ – 11.01.2026, 12.01.2026, 13.01.2026, 18.01.2026 & 19.01.2026
4. 07476 – విజయవాడ – హైదరాబాద్ – 10.01.2026, 11.01.2026. 12.01.2026, 17.01.2026 & 19.01.2026

Advertisement

i) రైలు నెం. 07473/07474 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ స్పెషల్

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్‌పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Advertisement

ii) రైలు నెం. 07475/07476 హైదరాబాద్ డక్కన్ – విజయవాడ – హైదరాబాద్ డక్కన్ స్పెషల్

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Also Read: సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×