E-Paper
Advertisement

సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!
Advertisement

SCR Weekly Special Trains: వేసవిలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు సికింద్రాబాద్ నుంచి వీక్లీ స్పెషల్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఏప్రిల్-మే నడుమ ఈ రైలు సర్వీసులను నడిపించాలని భావిస్తోంది.

సికింద్రాబాద్- నహర్‌లగన్ మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్-నహర్‌ లగన్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు వేసవి సెలవుల సమయంలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబాలతో కలిసి దూరప్రాంతాలకు వెళ్లే వారు, ఉద్యోగ కారణాలతో ప్రయాణించే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి. రద్దీ తగ్గడంతో పాటు, టికెట్లు సులభంగా దొరికే అవకాశం పెరుగుతుంది.

ఏప్రిల్ నుంచి మే వరకు ప్రత్యేక రైళ్లు

Advertisement

సికింద్రాబాద్ నుంచి నహర్‌లగన్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 07046) ఏప్రిల్ 10 నుంచి మే 22 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ రైలు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, ఆదివారం సాయంత్రం 4 గంటలకు నహర్‌ లగన్ చేరుకుంటుంది. అదే విధంగా, నహర్‌ లగన్ నుంచి సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చే రైలు (నెం. 07047) ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ఇది మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, బుధవారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

పూర్తిగా 3AC కోచ్ లతో..

ఈ రైళ్లు.. పూర్తిగా 3AC కోచ్‌లతోనే నడపబడతాయి. అంటే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సుదూర ప్రయాణం అయినప్పటికీ, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యంతో ప్రయాణం కాస్త సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Read Also: సికింద్రాబాద్–అనకాపల్లికి ఇక రెగ్యులర్ సర్వీసులు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

50కిపైగా స్టేషన్లలో హాల్టింగ్..

ఈ రైళ్లు మార్గ మధ్యంలో 50కి పైగా స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మాపూర్, ఖరగ్‌పూర్, బర్ధమాన్, మాల్దా, న్యూ జల్పైగురి, కోక్రాఝర్, రంగియా లాంటి అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ మార్గంలోనే బోలెడు పట్టణాలు, నగరాలకు చెందిన ప్రయాణికులు కూడా ఈ రైళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా సికింద్రాబాద్–నహర్‌ లగన్ మధ్య ఈ వీక్లీ స్పెషల్ రైళ్లు వేసవి ప్రయాణికులకు మంచి ఉపశమనంగా చెప్పుకోవచ్చు. సౌకర్యవంతమైన 3AC కోచ్‌ లు, పలు స్టాప్‌ లు మరింత ఉపయోగకరం కానున్నాయి. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే, ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Read Also: రైల్లో పెళ్లి బరాత్.. నెట్టింట వీడియో వైరల్, ఏం ఎంజాయ్ గురూ!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×