E-Paper
Advertisement

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!
Advertisement

Switzerland Tourism Targets Indian Travellers: స్విట్జర్లాండ్ అనగానే చాలామందికి మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన సరస్సులు, పచ్చని లోయలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ దేశాన్ని సందర్శించేందుకు ఇండియన్ టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, పర్యాటకుల రాకను ఏడాదంటా ఉండేలా స్విట్జర్లాండ్ టూరిజం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. శరదృతువుతో పాటు శీతాకాలంలోనూ భారతీయులు తమ దేశాన్ని సందర్శించేలా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది.

భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేక ప్రణాళిక

సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్విట్జర్లాండ్‌కు పర్యాటకుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే కాకుండా, మిగతా నెలల్లోనూ సందర్శకులను ఆకర్షించడంపై అక్కడి పర్యాటక సంస్థ దృష్టి పెట్టింది. ముఖ్యంగా శరదృతువు, శీతాకాలంలో స్పెషల్ ఎక్స్ పీరియెన్స్ ను భారతీయులకు పరిచయం చేయాలని భావిస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకే పరిమితం కాకుండా, పెద్దగా ప్రచారం పొందని ప్రాంతాలను కూడా సందర్శించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పర్యాటకులు కొత్త ప్రదేశాలను చూసే అవకాశం ఉండటంతో పాటు, ఇతర ప్రాంతాలకూ ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.

భారతీయుల నైట్ స్టేలో పెరుగుదల

Advertisement

స్విట్జర్లాండ్ ఫెడరల్ స్టాటిస్టికల్ లెక్కల ప్రకారం.. 2025లో భారతీయ పర్యాటకుల నైట్ స్టేలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.8 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల ద్వారా అదనంగా 12 వేల నైట్ స్టేలు నమోదయ్యాయి. అయితే, ఈ సంఖ్య  2019లో నమోదైన స్థాయితో పోలిస్తే ఇంకా 14.4 శాతం తక్కువగా ఉన్నాయి. దీంతో భారతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు స్విట్జర్లాండ్ టూరిజం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.

జెమీమా రోడ్రిగ్స్‌ తో ప్రచారం

భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ ను స్విట్జర్లాండ్ టూరిజం ఇండియన్ ఫ్రెండ్‌ షిప్ అంబాసిడర్‌గా నియమించింది. ఆమె ద్వారా స్విట్జర్లాండ్‌ లోని వివిధ ప్రాంతాలు, పర్యాటక అనుభవాలను భారతీయులకు పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పాటు కొత్త గమ్యస్థానాల గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం ఉపయోగపడనుంది.

భారతీయ ట్రావెల్ ఏజెన్సీలతో కలిసి..

Advertisement

స్విట్జర్లాండ్ టూరిజం భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తోంది. విలాసవంతమైన పర్యటనలు, కుటుంబ విహారయాత్రలు, వివాహ వేడుకల కోసం స్విట్జర్లాండ్‌ను ఎంచుకునే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాగే, ప్రజా రవాణా సదుపాయాలు, ప్రాంతీయ పర్యాటక కేంద్రాలు, సీజన్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండే కార్యక్రమాలను కూడా ప్రచారంలో భాగంగా చూపిస్తోంది.

ఏడాది పొడవునా టూరిస్టులను ఆకర్షించేలా..

భారతీయ పర్యాటకులు వేసవి నెలల్లోనే కాకుండా, శరదృతువు, శీతాకాలంలోనూ స్విట్జర్లాండ్‌ ను సందర్శించేలా చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. కొత్త ప్రాంతాలను అన్వేషించడం, ఎక్కువ రోజులు అక్కడ బస చేయడం ద్వారా పర్యాటకులు క్రేజీ ఎక్స్ పీరియెన్స్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా, భారతీయ పర్యాటకుల కోసం స్విట్జర్లాండ్ టూరిజం తన ప్రచారాన్ని మరింత విస్తరిస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు భిన్నంగా న్యూ డెస్టినేషన్స్ పరిచయం చేస్తూ, ఏడాది పొడవునా పర్యాటక రంగానికి ఊతమివ్వాలని ప్రయత్నిస్తోంది.

Read Also: విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

Tags

Related News

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×