E-Paper
Advertisement

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?
Advertisement

YSRCP Infighting: ఇచ్చాపురం వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మిని ప్రకటించిన వెంటనే పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఇన్నాళ్లూ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు ఇచ్చాపురం వైసీపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి.

ఛైర్‌పర్సన్ పీఠంపై ఆశలు..

ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికపై పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ విమర్శలు, పోస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా ఛైర్‌పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఉలాల భారతిదివ్య సోషల్ మీడియా వేదికగా తన అనుచరులతో అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. యాదవ సామాజిక వర్గానికి ఛైర్‌పర్సన్ పదవిని కేటాయించలేదంటూ ఆమె వర్గీయులు చేసిన విమర్శలు పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టాయి.

Advertisement

Also read: రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

టికోడళ్లు నామినేషన్లు..

మరోవైపు, పార్టీ అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో నెలకొన్న అసంతృప్తి ప్రభావం ఎన్నికల సమీకరణాలపై పడకుండా వైసీపీ ఛైర్‌పర్సన్ భర్త చివరి నిమిషం వరకు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభ్యర్థి ఎంపికపై వ్యతిరేకత, నేతల మధ్య విభేదాలు పార్టీకి ఎలాంటి సవాల్‌గా మారనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇచ్చాపురం రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే వార్డు నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు తోటికోడళ్లైన ఉలాల జ్యోతి, ఉలాల భారతిదివ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఛైర్‌పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న భారతిదివ్య, అదే కుటుంబానికి చెందిన జ్యోతితో ఒకే వార్డులో బరిలోకి దిగడం రాజకీయ చర్చకు దారితీసింది.

వైసీపీ ఎన్నికల వ్యూహం..

Advertisement

ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికతో మొదలైన అసమ్మతి.. సోషల్ మీడియా విమర్శలతో మరింత బహిర్గతం కాగా, ఇప్పుడు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీ ఎన్నికల వ్యూహంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అసంతృప్త నేతలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక ఎన్నికల వేళ కొత్త రాజకీయ మలుపులు చోటుచేసుకుంటాయానన్న విషయాలు జోరందుకున్నాయి. ఇచ్చాపురం వైసీపీలో అంతర్గత అసంతృప్తి చల్లారుతుందా? లేక ఎన్నికల వేళ మరింత ముదురుతుందా? అన్నది వేచి చూడాలి!

Also read: మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

Tags

Related News

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

Big Stories

Advertisement
×