E-Paper
Advertisement

Cyclone Ditwah Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, విమానాలు ఆలస్యం!

Cyclone Ditwah Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, విమానాలు ఆలస్యం!
Advertisement

శ్రీలంకలో గతంలో విధ్వంసం సృష్టించి, 69 మంది ప్రాణాలు తీసిన దిత్వా తుఫాన్, భారత దక్షిణ తీరాన్ని సమీపిస్తోంది. నవంబర్ 30 తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వైపు తుఫాను దూసుకొచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌ లో, తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 8 కి.మీ. వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ముందుకుసాగుతున్నట్లు IMD తెలిపింది. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 300 కి.మీ చెన్నైకి దక్షిణంగా 400 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది.

తమిళనాడులో హై అలర్ట్

దిత్వా తుఫాను సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నవంబర్ 29, 30 మధ్య దక్షిణ, కావేరి డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరుతో సహా అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రైళ్లు, విమానాలపై తీవ్ర ప్రభావం   

Advertisement

దిత్వా తుఫాను నేపథ్యంలో రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ తుఫాను కారణంగా దక్షిణ తమిళనాడులో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. కొలంబో, జాఫ్నా, పాండిచ్చేరి, టుటికోరిన్, తిరుచిరాపల్లి, చెన్నై, మధురైకి బయలుదేరే విమానాల మీద ఈ తుఫాన్ ఎఫెక్ట్ పడినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణీకులు ఎప్పటికప్పుడు ఆయా విమానాలకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. దిత్వా కారణంగా చెన్నై నుంచి వెళ్లే తమ విమానాలు ప్రభావితమవుతాయని అకాసా ఎయిర్ కూడా తెలిపింది. ప్రయాణీకులకు తమ వెబ్‌ సైట్‌ లో విమాన స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఇవాళ కనీసం 40 విమానాలు దిత్వా తుఫాను కారణంగా ప్రభావితమయ్యాయని చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.

Advertisement

Read Also: ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్.. కారణం ఏంటంటే?

పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే

తుఫాన్ కారణంగా పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. మరికొన్ని పూర్తిగా రద్దు అయ్యాయి.  22662- రామేశ్వరం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ ప్రెస్, 16104- రామేశ్వరం – తాంబరం ఎక్స్‌ ప్రెస్, 16344- మధురై – తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్‌ ప్రెస్, 16850-రామేశ్వరం – తిరుచ్చిరాపల్లి ఎక్స్‌ ప్రెస్, 16752-మండం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు అయ్యాయి.

Read Also:  ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×