E-Paper
Advertisement

Comfort Air Travel: రైళ్ల తరహాలోనే విమానాల్లో పడుకొని ప్రయాణించవచ్చు.. ప్రయాణికులకు పండగే!

Comfort Air Travel: రైళ్ల తరహాలోనే విమానాల్లో పడుకొని ప్రయాణించవచ్చు.. ప్రయాణికులకు పండగే!
Advertisement

United Airlines Relax Row: అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో సౌకర్యాన్ని పెంచేందుకు యునైటెడ్ ఎయిర్ లైన్స్  కీలక నిర్ణయం తీసుకుంది. రిలాక్స్ రో పేరుతో కొత్త ఎకానమీ సీట్లను తీసుకురాబోతోంది. ఇవి సాధారణ సీట్లకు భిన్నంగా ఉండబోతున్నాయి. అవసరమైతే సోఫా లా మారేలా డిజైన్ చేశారు. దీని ద్వారా సుదూర ప్రయాణాల్లో ప్రయాణీకులు ఎలాంటి అలసట లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

రిలాక్స్ రో పరిచయం

సాధారణంగా ఎకానమీ క్లాస్‌ లో ప్రయాణం అంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాళ్లు చాపుకునే స్థలం తక్కువగా ఉంటుంది. సరిగ్గా నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ ఎయిర్‌లైన్స్  రిలాక్స్ రోను రూపొందించింది. మూడు సీట్లు కలిసి ఒక వరుసగా ఉండే ఈ సీటింగ్‌ లో ప్రత్యేకంగా అడ్జస్ట్ అయ్యే లెగ్ రెస్ట్‌ లు ఉంటాయి. వీటిని 90 డిగ్రీల కోణంలో పైకి ఎత్తి, సీట్లను దాదాపు ఒక చిన్న బెడ్‌ లా మార్చుకోవచ్చు. దీంతో ప్రయాణికులు సౌకర్యంగా పడుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.

రిలాక్స్ కావాలనుకునే వారికి అనుకూలంగా..

Advertisement

రిలాక్స్ రో చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు, జంటలకు, ఒంటరిగా ప్రయాణిస్తూ కాస్త రిలాక్స్ కావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ సీట్లతో పాటు కొన్ని అదనపు సౌకర్యాలు కూడా అందిస్తారు. ప్రత్యేకంగా పరుపు, దుప్పటి, అదనపు దిండ్లు, పిల్లల కోసం ట్రావెల్ కిట్ లాంటి సదుపాయాలు టిక్కెట్‌ లోనే ఉంటాయి. అంటే, ఎకానమీ క్లాస్‌లోనే ఒక ప్రీమియం అనుభవం పొందే అవకాశం ఉంటుంది.

2027 నుంచి కొత్త సదుపాయం అమలు

ఈ కొత్త సదుపాయాన్ని 2027 నుంచి ప్రారంభించాలని యునైటెడ్ ఎయిర్‌ లైన్స్ భావిస్తోంది. 2030 నాటికి తమకు చెందిన 200కు పైగా విమానాల్లో, ముఖ్యంగా బోయింగ్ 787, 777 వైడ్‌ బాడీ విమానాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి విమానంలో సుమారు 12 రిలాక్స్ రో సెక్షన్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇవి ఎకానమీ, ప్రీమియం ప్లస్ మధ్యలో ఒక కొత్త ఆప్షన్‌ లా ఉండబోతున్నాయి.

Advertisement

Read Also: భూగర్భంలో గ్రామాలు, ప్రపంచంలో ఇదో వండర్!

నెటిజన్లు ఏమంటున్నారంటే?

యునైటెడ్ ఎయిర్ లైన్స్ తాజా నిర్ణయాన్ని ప్రయాణీకులు స్వాగతిస్తున్నారు. ఇకపై విమాన ప్రయాణాల్లో చక్కగా నిద్రపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు. అయితే, యునైటెడ్ ఈ సదుపాయాన్ని ఉత్తర అమెరికాలో మొదటిసారి తీసుకువస్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి. ఎయిర్ న్యూజిలాండ్ ఇప్పటికే స్కైకౌచ్  సర్వీసును అందిస్తోంది. ఆల్ నిప్పన్ ఎయి ర్‌వేస్ కూడా ఇలాంటి సీటింగ్ ఆప్షన్లు అందిస్తోంది. ఏదైతేనేం, రిలాక్స్ రో లాంటి సరికొత్త ఆలోచనలు భవిష్యత్తులో విమాన ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే అవకాశముంది.

Read Also: సమ్మర్ లో కూల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 హిల్ స్టేషన్స్ ట్రై చేయండి!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×