E-Paper
Advertisement

Underground Village: భూగర్భంలో గ్రామాలు, ప్రపంచంలో ఇదో వండర్!

Underground Village: భూగర్భంలో గ్రామాలు, ప్రపంచంలో ఇదో వండర్!
Advertisement

Hidden Underground Villages: ఇండ్లు ఎక్కడ కట్టుకుంటారు? ఎవరిని అడిగినా, భూమ్మీద అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఇప్పుడు భూగర్భంలో ఉన్న గ్రామాల గురించి తెలుసుకుందాం. భూగర్భంలో గ్రామాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది నిజం. అక్కడ నేలపై కాకుండా నేల కింద ప్రజలు జీవిస్తారు. ఈ అద్భుమైన గ్రామాలు చైనాలో ఉన్నాయి.  డ్రాగన్ కంట్రీలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి గ్రామాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక జీవన విధానానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర చైనాలోని లోయెస్  ప్రాంతాల్లో ఈ భూగర్భ నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి.

భూగర్భంలో నివాసాలు ఎందుకు?

లోయెస్  ప్రాంతంలో నేల మృదువుగా ఉండటంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల నుంచి తట్టుకునేందుకు ప్రజలు నేలలో గుహల్లాంటి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. వీటిని సాధారణంగా యావోడాంగ్ అని పిలుస్తారు. బయటకు చూసినప్పుడు ఇవి పెద్దగా కనిపించకపోయినా, లోపల మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. హాల్, కిచెన్, బెడ్ రూమ్ లతో బయట ఇండ్లు ఎలా ఉంటాయో? భూగర్భంలో కూడా అలాగే ఉంటాయి. ఈ నివాసాలు ఎండ కాలంలో కూడా సహజంగా చల్లగా ఉంటాయి. శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి.

ప్రకృతి అనుకూలమైన నిర్మాణాలు

Advertisement

భూగర్భ గ్రామాల్లో జీవనం చూడ్డానికి సాదాసీదాగా కనిపించినా, వాటి నిర్మాణ శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ వనరులతో నిర్మించిన ఈ ఇళ్లు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. బయట ప్రపంచంతో పోలిస్తే, ఇక్కడ శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి గ్రామాలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజల నివాసాలుగా కొనసాగుతున్నాయి. రోజువారీ జీవితం సాధారణంగానే ఉంటుంది. వీరి పిల్లలు చదువుకోడానికి సమీప పట్టణాలకు వెళ్తారు. పెద్దలు వ్యవసాయంతో పాటు చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చినా, ఇంకా చాలా ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానం కొనసాగుతోంది.

క్రమంగా తగ్గుతున్న భూగర్భ గ్రామాలు

ఆధునికీకరణ ప్రభావంతో ఈ భూగర్భ గ్రామాలు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త తరాలు నగరాలకు వలస వెళ్తుండటంతో, పాత నివాసాలు క్రమంగాఖాళీ అవుతున్నాయి. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఈ గృహాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులు ఈ భిన్నమైన జీవన విధానాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Read Also:ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!

పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం

మొత్తంగా చైనాలోని భూగర్భ గ్రామాలు మనిషి ప్రకృతితో కలిసిపోయి ఎలా జీవించగలడో చూపించే అద్భుతమైన గుర్తులుగా కొనసాగుతున్నాయి. ఇవి కేవలం నివాసాలే కాకుండా, సాంప్రదాయం, సంస్కృతి, సృజనాత్మకతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగవకుండా కాపాడటంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు డ్రాగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Read Also: బాంబుల హోరు, మిస్సైళ్ల జోరు.. కాలుష్య కోరల్లో మిడిల్ ఈస్ట్ దేశాలు!

Related News

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×