E-Paper
Advertisement

Viral News: ఇక కాకులు కూడా మనుషుల్లా సంపాదివచ్చు.. చెత్త కనిపిస్తే వాటికి పండగే!

Viral News: ఇక కాకులు కూడా మనుషుల్లా సంపాదివచ్చు.. చెత్త కనిపిస్తే వాటికి పండగే!
Advertisement

Crows Trained to Collect Trash and Earn Rewards: కాకుల గురించి చాలా ఆసక్తికర కథలు వెలుగులో ఉన్న విషయం తెలిసిందే. చిన్నప్పుడే కడవ అడుగులో ఉన్న నీళ్లను తాగేందుకు రాళ్లు వేసిన కథ గురించి అందరూ తెలుసుకునే ఉంటారు. కాకికి అతీత శక్తులు ఉన్నాయని, వాటికి ఆత్మలు కనిపిస్తాయని భావిస్తారు కూడా. కాసేపు ఆత్మలు, దెయ్యాల గురించి పక్కన పెడితే, కాస్త తెలివి నేర్పితే అవి కూడా మనుషుల్లా సంపాదించుకునేందుకు ప్రయత్నాయని తాజాగా వెల్లడి అయ్యింది. స్వీడన్ లో అధికారులు చేసిన ప్రయత్నం ఫలించించింది. ఇంతకీ కాకులకు, స్వీడన్ లో సంపాదనకు ఉన్న సంబంధం ఏంటంటే?

కాకులు పరిసరాలను శుభ్రం చేస్తే?

అవును.. తెలివైన పక్షులు అయిన కాకులను పరిసరాలు శుభ్రం చేసే పనికి నియమిస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. స్వీడన్ లోని ఓ నగరాన్ని శుభ్రం చేసే బాధ్యతను కాకులు తీసుకున్నాయి. కార్విడ్ క్లీనింగ్ అనే స్టార్టప్ ఒక పైలట్ యంత్రాన్ని పరీక్షించింది. సిగరెట్ ముక్కలు, చిన్న చిన్న మొత్తంలో చెత్త తెచ్చి ఆ యంత్రంలో వేస్తే, అందుకు ప్రతిఫలంగా ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. మొత్తంగా చిన్న ఆహార బహుమతులకు బదులుగా కాకులకు సిగరెట్ ముక్కలను సేకరించేలా ట్రైనింగ్ ఇచ్చింది.

Advertisement

కార్విడ్స్ సంస్థ.. పక్షులను ఉపయోగించుకుని వాటికి ట్రైనింగ్ ఇస్తుంది. వీటికి సాధారణంగా జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పని చేయాలనే ఆసక్తి ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని నగరాన్ని క్లీన్ ఉంచాలనుకుంది సదరు సంస్థ.  ఈ ప్రయోగాలలో భాగంగా, చెత్తను సేకరించిన కాకులకు ఆహారాన్ని అందించేలా ఓ యంత్రాన్ని రూపొందించారు. అందులో కాల్చి పడేసిన సిగరెట్ ఫిల్టర్లను వేయగానే, కాస్త ఫుడ్ అందిస్తుంది.

Read Also: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!

Advertisement

నిజానికి సిగరెట్ ముక్కలు అనేవి ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో పెద్ద సమస్యగా మారాయి. ఇవి తరచుగా జలమార్గాల్లో, బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తుంటాయి. పరిసరాలల్లో చెత్తలా పేరుకుపోతాయి. అందుకే ఈ సమస్యను తొలగించేందుకు పక్షుల మేధస్సును ఉపయోగించుకోవాని సదరు స్టార్టప్ కంపెనీ నిర్ణయించింది. చివరకు అనుకున్నది సాధించింది. పక్షులకు ఆహారాన్ని అందిస్తూ, పరిసరాలను క్లీన్ గా ఉంచే ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నది.

స్టార్టప్ ఆలోచనపై సర్వత్రా ప్రశంసలు

అటు ఈ ఆలోచనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్షుల శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చేయించడం నిజంగా అద్భుతం అంటున్నారు.  పాఠశాలలో నేర్చుకున్న పాఠం కథ మాత్రమే అనుకునే వాళ్లు, ఇప్పుడు నిజమే అని భావిస్తున్నారు. నిజంగా కాకులను పరిసరాల శుభ్రతకు ఉపయోగించుకోవడం అభినందనీయం అంటున్నారు.

Read Also: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?

Related News

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

Big Stories

Advertisement
×