E-Paper
Advertisement

Goods Train Brake Failure: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?

Goods Train Brake Failure: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?
Advertisement

భారతీయ రైల్వేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తృటిలో పెనుప్రమాదం తప్పింది. పరిస్థితి ఘోర దుర్ఘటనకు కారణం అవుతుందనుకున్నా, చివరకు అంతా సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఎందుకు రైల్వే అధికారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చిందంటే..

గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్..

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరగింది. పలాస్దారి- కర్జాత్ రైల్వే స్టేషన్ల మధ్య బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ గూడ్స్ రైలు కంట్రోల్ కోల్పోయింది. వేగం అకస్మాత్తుగా 75 కిలో మీటర్లుకు పెరిగింది.  విషయం తెలిసి రైల్వే అధికారులు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి నెటట్టివేయబడ్డారు. అయినప్పటికీ, ఆ రైలును ఆపేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. రకరాలక పద్దతులను ఉపయోగించి సదరు గూడ్స్ రైలును ముంబై శివార్లలో అపేశారు. పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.

అనూహ్యంగా పెరిగిన రైలు వేగం

Advertisement

వాస్తవానికి గూడ్స్ రైలు వేగం చాలా తక్కువగా ఉంటుంది. ప్యాసింజర్ రైలుతో పోల్చితే, అందులో సగం ఉంటుంది. కానీ, తాజాగా పూర్తి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు పని చేయడం మానేశాయి. లోయలు, మలుపులు ఉండటంతో రైలు వేగం ఊహించని విధంగా పెరిగింది. లోకో పైలట్లు ఎంత ప్రయత్నించినా రైలు ఆగకపోగా, మరింత వేగం పెరగడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైలు 75 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వివరించారు.

Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, అందుబాటులోకి 1,244 స్పెషల్ రైళ్లు!

Advertisement

వెంటనే అలర్ట్ అయిన అధికారులు

ఎమర్జెన్సీ సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు, వెంటనే రంగలోకి దిగారు. ఆ సమయంలో గూడ్స్ రైలుకు ఏ రైలు ఎదురుగా రాకుండా తగిన చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేశారు. ఎలాంటి పొరపాటు జరిగినా ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని అంచనా వేసిన అధికారులు వెంటనే ఎర్జెన్సీని ప్రకటించారు. రైలు వేగాన్ని తగ్గించేందుకు రైల్వే ఇంజినీర్లు అన్ని పద్దతులను అమలు చేశారు. పట్టాలపై కొన్ని చోట్ల వేగాన్ని నిరోధించే సాంకేతిక అడ్డంకులను క్రియేట్ చేశారు. రైలును సజావుగా లేని ట్రాక్ ల మీదికి పంపించడం ద్వారా వేగాన్ని తగ్గేలా చేశారు. చివరకు రైలు వేగాన్ని 30 కిలో మీటర్లకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు ముంబై శివారు ప్రాంతంలో రైలును ఆపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రమాద సమయంలో గూడ్స్ రైల్లో 50 వ్యాగన్లు ఉన్నాయి. అటు ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే దర్యాప్తుకు ఆదేశించింది.

Read Also: రైల్ వన్ యాప్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? వావ్, ఇంత సులభమా!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×