Balakrishna: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలో బాలకృష్ణ తీసుకున్న ఒక కొత్త నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయానికి వస్తే దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి ప్రస్తుతం కాస్త క్లిష్టంగా మారిందని చెప్పాలి. ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఆయన..ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం హరీష్ శంకర్‌కు పెద్ద షాక్ అయింది. దీంతో ఆయన ఆశలు అన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో హరీష్ శంకర్, నందమూరి బాలకృష్ణతో ఒక కొత్త సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని కూడా అనుకున్నారు. ఈ కాంబినేషన్‌కు మొదట మంచి క్రేజ్ ఏర్పడింది. అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా పరిస్థితిని గమనించిన తర్వాత, బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది.
హరీష్ శంకర్‌కు ఇది మరో పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడం వల్ల ఆయన కెరీర్‌లో కాస్త డౌన్ ఫేజ్ నడుస్తోంది. ఇప్పుడు తిరిగి ఫామ్‌లోకి రావడం ఆయనకు చాలా ముఖ్యం అయింది.
అందుకే హరీష్ శంకర్ ఇప్పుడు కొత్త కథలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మంచి హిట్ ఇస్తేనే ఆయన మళ్లీ టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించగలరు.
ఇక మరోవైపు బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.