E-Paper
Advertisement

చీటింగ్ కేసు.. అషురెడ్డికి బాగా కలిసొచ్చిందే!

చీటింగ్ కేసు.. అషురెడ్డికి బాగా కలిసొచ్చిందే!
Advertisement

Ashu Reddy:సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అషురెడ్డి.. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ తో కలిసి ఒక షోలో పాల్గొని హోస్ట్ గా సందడి చేస్తోంది. ఇక జూనియర్ సమంతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. మంచి డాన్సర్ కూడా.. ఇదిలా ఉండడం తాజాగా రూ.9.35 కోట్ల చీటింగ్ కేసులో ఇరుక్కుని ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.. ఇకపోతే చీటింగ్ కేసు వల్ల ఈమె ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొందో.. అంతే లాభ పడింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చీటింగ్ కేసు.. ఆమెకు భారీ ఆదాయం..

ఒకవైపు లండన్ కి చెందిన ఐటీ ఉద్యోగి ధర్మేంద్ర తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9 కోట్లు కాజేసిందని కేసు పెట్టారు. ఆ తర్వాత అషు రెడ్డి కోటిన్నర వెనక్కి తిరిగి ఇస్తానని.. మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పిన ఆడియో లీక్ కూడా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు సంగతి కాస్త పక్కన పెడితే.. ఈ వివాదం వల్ల ఈమెకు భారీగా లాభం చేకూరింది. ఈమె ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ.. ఆమెకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.. ఏప్రిల్ 22వ తేదీన అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టింది. ఒక వీడియోలో సబ్స్క్రిప్షన్ మీద సరదాగా ఆమె కామెంట్ కూడా చేశారు. ఎక్కువ వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. అయితే ఆ రోజు మినిమం 30 మంది కూడా లేరు. కానీ ఈ ఒక్క వివాదంతో ఈమెకు ఊహించని పాపులారిటీ లభించింది. ఒకవైపు చీటింగ్ కేసు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే.. మరొకవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమెకు సబ్స్క్రైబర్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు సుమారుగా 3000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. సుమారుగా 10 లక్షల ఆదాయం చేకూరింది .

మరింత పెరిగే అవకాశం..

Advertisement

ఇకపోతే ఆమె ఇంస్టాగ్రామ్ చెక్ చేస్తే తన ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లో పోస్ట్ చేసింది ఏమీ లేదు. కేవలం మూడు రీల్స్, 9 స్టోరీలు మాత్రమే పోస్ట్ చేసింది. ఇక ఇంకొన్ని వీడియోలు , స్టోరీలు పోస్ట్ చేస్తే ఇంకెంత మంది వస్తారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ చీటింగ్ కేసు మాత్రం అషు రెడ్డికి భారీగా లాభాన్ని అందించి పెట్టిందని చెప్పవచ్చు.

ALSO READ:మైసా కోసం రష్మిక రిస్క్!

చీటింగ్ కేసు అసలు వ్యవహారం ఇదే..

Advertisement

ఇకపోతే ఈ వివాదం విషయానికి వస్తే 2018 లో లండన్ లో ఉద్యోగం చేస్తున్న ధర్మేంద్ర సెలవుల కోసం తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో పరిచయమైన అషు రెడ్డి అమెరికాలో చదువుకొని అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి సినిమాల కోసం ఇండియాకి వచ్చానని చెప్పింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పైగా ఐదు కేజీల బంగారం, ఖరీదైన ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి అన్నింటిని తనపైన రిజిస్టర్ చేయించుకుంది. పెళ్లి చేసుకోమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని సదరు బాధితుడు తండ్రి హైదరాబాద్ సిసిఎస్ లో కంప్లైంట్ చేశారు. తర్వాత ఈమె తండ్రి దీనిపై స్పందించి తన కూతురు అమాయకురాలు ఇదంతా ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికే అంటూ కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు ఆడియో లీక్ లో అషురెడ్డి నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×