Gundeninda GudiGantalu Today episode june 29th: డ్యాన్స్ స్కూల్ లో ప్రభావతి అందరిని రెడీ చేస్తుంది. అయితే చింతామణి మాత్రం సోఫాలో కూర్చుని ఉండటం చూసినా ప్రభావతి ఆమె దగ్గరికి వెళుతుంది. మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం నాకు ఇప్పుడు మూడు లేదు తర్వాత చేస్తాను అని అంటుంది. మీరిలా అంటే ఎలాగండి.. డాన్స్ కోసమే కదా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ఇలా అంటారేంటి వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం నాకు పనుంది నేను చెయ్యను అని మొండిగా చెప్తుంది.. ప్రభావతికి చింతామణి పై అనుమానం మొదలవుతుంది.
చింతామణి మీనా అలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది.. మీరు చెప్పిన మాట వినకుండా మీనా అలా చేయడం మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం కొట్టేసినట్టు అనిపిస్తుంది. నేను ఎంత చేసినా కూడా మీనాన్ని ప్రయత్నాన్ని ఆపలేకపోతున్నాను.. ఇప్పుడు మీ కోడలు లక్షల సంపాదిస్తుంది కదా మిమ్మల్ని లెక్క చేస్తుందా అని చింతామణి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ మాట విన్న ప్రభావతి చింతామణి ఎందుకిలా మాట్లాడుతుంది అని షాక్ అవుతుంది. మొత్తానికి చింతామణి మనసులోని మాట అయితే బయట పడిపోతుంది. మరి ప్రభావతి చింతామణి మాట విని మీనాని ఇంట్లోనే కూర్చో పెడుతుందా..? లేదంటే తనని ఇంకాస్త వ్యాపారం పెంచుకునేలా చేస్తుందా అన్నది ప్రస్తుతం జనాలు ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా కూడా ప్రభావతికి చింతామణి పరిచయమైన విషయం మీనాకు తెలిస్తే మాత్రం ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుందని తెలుస్తుంది..
మీనాని తీసుకొని వచ్చిన బాలు నువ్వు డబ్బులు కట్టావు కదా డ్రైవింగ్ నేర్చుకోవాలి రా బయటికి వెళ్దాం అనేసి బలవంతంగా తీసుకొని వెళ్తాడు.. ఈరోజు వద్దులేండి ఇంకెప్పుడైనా నేర్చుకుంటాను అని చెప్పగానే అదేమీ లేదు నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సిందే అని మీనా అని బలవంతంగా బయటికి తీసుకొచ్చిన బాలు ఎలాగైనా సరే మీ నాకు డ్రైవింగ్ నేర్పించాలని అనుకుంటాడు. సంసారం చేసినంత ఈజీ కాదు డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని బాలు తనకి హితబోత చేస్తూ మరి డ్రైవింగ్ నేర్పిస్తాడు.. మీరు చెప్పిన కూడా నిజమే అండి ఇన్ని రోజులు నేను పక్కన కూర్చుని డ్రైవింగ్ చూస్తున్నంత సేపు అంత ఈజీ గానే ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేర్చుకోవాలంటే అని నాకు కష్టంగా ఉంది అని అంటాడు.. అయితే మీనా బాలు ఇద్దరు కూడా చాలా సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంటారు..
ప్రభావతి రాత్రి కిందకు దిగి వస్తుంది.. ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది ఎవరు దుప్పట్లో ఉండేది అని అంటుంది… ప్రభావతిని చూసిన బాలు మీనా ఇద్దరు బయటకు వస్తారు.. ఇదేంటి ఇక్కడ పెట్టారు అని ప్రభావతి అడుగుతుంది. మాకు రూమ్ లేదు కదా ఎక్కడ పెట్టుకోవాలి అని బాలు మీనా ఇద్దరు అంటారు.. ఏదో ఒకటి చేయండి అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఫోన్ చూసుకుంటూ మనోజ్ కి ఎందుకు రావడంతో అక్కడున్న వేడి నీళ్లు తన కాలి మీద పడతాయి.. కాలు మీద వేడి నీళ్లు పడగానే మనోజ్ కెవ్వుమని కేకలు వేస్తాడు.. ఇదంతా బయట ఎందుకు చేశారు అని అందరూ అడగ్గని మాకు రూమ్ ఎక్కడుంది ఎక్కడ పెట్టుకోవాలి అని రోహిణికి షాక్ ఇస్తుంది మీనా.. మనోజ్ మాత్రం తన కాలు కాలింది అని చాలా బాధపడిపోతూ ఉంటాడు.. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన శృతి మీనా వాళ్ళకి రూమ్ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే పెట్టుకుంటారు అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. ఇక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది..
బయట కార్ స్టాండ్ దగ్గర ఉన్న డ్రైవర్ల అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. అప్పుడే ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ హెల్మెట్ లేకుండా అలాగే డ్రైవింగ్ స్పీడ్ గా చేస్తూ ఫోన్ మాట్లాడుతూ వస్తాడు.. అది చూసిన బాలు మనకి బాగా దొరికిపోయాడు అని వీడియో తీస్తాడు.. ఈ వీడియోతో మనం విని అడ్డుపెట్టుకొని ఏదైనా అనొచ్చు అని రాజేష్ తో కలిసి అతని బండిని చేను వేసి లాక్ చేస్తాడు.. అది చూసిన నా బైక్ ని ఎవరు ఇలా చేశారు అని అడుగుతాడు అప్పుడు అక్కడికి వచ్చిన బాలు నేనే చేశాను మీకు ఒక రూల్స్ మాకు ఒక రూల్స్ అని మాట్లాడుతాడు.. మీ రూల్స్ మీకు మాత్రం వర్తించవా అని బాలు అరుణ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. నేను అర్జెంటుగా వెళ్లాలి అని అరుణ్ అనగానే రాజేష్ బైకుని ఇచ్చేస్తాడు..
సుందరి పెళ్లి పత్రికలు ప్రింటింగ్ ఇచ్చాము అని రంగా అలాగే కామాక్షి ఇద్దరు కలిసి సత్యం వాళ్ళ కుటుంబం కి చెప్పడానికి పండ్లు తీసుకొని వస్తారు.. రంగా కామాక్షి ఇద్దరు కూడా ఈ పెళ్లి జరగడానికి కారణం బాలు మీనా అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాలు మీనాలపై ప్రశంసలు కురిపిస్తారు.. ఇక పెళ్లికి మీ కుటుంబం ముందుండి అన్ని చేయాలి అని రంగా కోరగానే.. ఇక బాలు మీనా దగ్గరుండి పెళ్లికి అన్ని చేస్తామని అంటారు.. ఇక రెస్టారెంట్ కి సంబంధించి పనులు నువ్వు రవి చూసుకుంటాను అని అంటాడు.. మేకప్వేయడానికి రోహిణి కాస్త వెనకడుగు వేస్తుంది.. మొత్తానికి బాలు మీన ఇద్దరు కలిసి సుందరి పెళ్ళికి పెద్దలుగా మారుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపిటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…