E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వచ్చిన శృతి – షాక్ లో రేఖ 

Brahmamudi Serial Today Episode June 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వచ్చిన శృతి – షాక్ లో రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: శృతి కోసం రాజు, ఇందు ఎదురుచూస్తూ ఉంటే.. రేఖ వచ్చి మనసులో నవ్వుకుంటుంది. రాజు, ఇందులను టెన్షన్‌ పెడుతుంది. హర్ష తొందరపెడుతున్నారు. తనకు టైం అయిపోతుందట.. అంటూ ఇంకాస్త కంగారుపెడుతుంది. దీంతో ఇందు శృతి కోసం వెయిట్ చేస్తున్నాము వచ్చేస్తుంది అని చెప్పగానే.. రేఖ, శృతి రావడం లేట్‌ అవుతుందేమో నేను వెళ్లి హర్షను వెళ్లిపోమ్మని చెప్తాను అనగానే.. రాజు కోపంగా ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు.. ఈ డీల్‌ క్యాన్సిల్‌ చేయాలని చూస్తున్నారా..? శృతి వస్తుంది.. డిజైన్స్‌ తీసుకొస్తుంది అని చెప్పగానే.. రేఖ నవ్వుతూ.. అసలు రాదు.. అది నా గుప్పిట్లో ఉంది అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో ఆఫీసు ముందు ఆటో వచ్చి ఆగుతుంది. అందులోంచి శృతి దిగుతుంది. శృతిని చూసిన రాజు ఆనందంగా పిన్ని అక్కడ చూడు శృతి వచ్చేసింది అని చెప్పగానే.. ఇందు చూసి హ్యాపీగా ఫీలవుతుంది. రేఖ మాత్రం షాక్ అవుతుంది. శృతి దగ్గరకు వెల్లగానే.. ఇందు ఏంటండి శృతి గారు ఇంత లేట్‌ చేశారు. మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్‌ చేస్తున్నాం అనగానే.. శృతి సారీ ఇందు గారు నా స్కూటీ ట్రుబుల్‌ ఇచ్చింది. టైంకు ఆటో దొరకలేదు అందుకే లేట్‌ అయింది ఇదిగోండి డిజైన్స్‌ అంటూ ఇస్తుంది. రేఖ మాత్రం కోపంగా ఇది ఇక్కడకు వస్తే ఆ వెధవలు అక్కడేం చేస్తున్నారు అని మనసులో తిట్టుకుంటుంటే.. రాజు వెళ్లి పిన్ని మనసులో అనుకుకుంటే ఎలా ఒకసారి ఫోన్‌ చేసి కనుక్కో ఆ ఇంట్లో ఎవరున్నారో తెలిసిపోతుంది కదా… అంటూ చెప్పి వెళ్లిపోగానే.. రేఖ కోపంగా ఆ రౌడీలకు ఫోన్‌ చేసి తిడుతుంది. మీరు ఎక్కడున్నారు అంటూ అడగ్గానే.. మేము శృతి వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నాము.. ఇప్పుడే సోడా అడిగాము తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లింది అని చెప్పగానే.. రేఖ కోపంగా అరేయ్‌ అది ఆఫీసుకు వచ్చేసింది. అక్కడ ఎవరున్నారో చూడండి అనగానే..అప్పుడే రౌడీలకు లక్కీ చీర కట్టుకుని సోడా తీసుకుని వస్తాడు. లక్కీని చూసిన రౌడీలు షాక్‌ అవుతారు.

Advertisement

ఇందు, రాజు డిజైన్స్‌ తీసుకుని వెళ్లి హర్షకు ఇస్తారు. హర్ష డిజైన్స్‌ చూస్తుంటే.. రాజు డిజైన్స్‌ ఎలా ఉన్నాయి సార్‌ డిజైన్స్‌ బాగున్నాయా… అని అడుగుతాడు. దీంతో హర్ష బాగున్నాయి కానీ ఇక్కడ కొంచెం మారిస్తే సరిపోతుంది.. అంటూ చెప్తుంటే.. రేఖ ఇదే దొరికిన చాన్స్‌ అనుకుని ఎలాగైనా హర్షను డైవర్ట్‌ చేసి డీల్‌ క్యాన్సిల్‌ చేయించాలని మనసులో అనుకుని రేఖ కోపంగా ఇందును తిడుతుంది. ఏంటి ఇందు హర్ష గారు తన విలువైన టైం మనకు ఇస్తే.. ఇలా డిజైన్స్‌ చేస్తారా..? అంటూ తిడుతుంటే.. రాజు అడ్డు పడి అమ్మ రేఖ పిన్ని మొత్తం మీద డీల్‌ క్యాన్సిల్‌ చేయాలని చూస్తున్నావా… ఎలాగైనా రేఖను సైడ్‌ చేయాలని రాజు తాము ఆ డిజైన్స్‌ ఎందుకు వేశామో ఇందు మీకు ఎక్స్‌ఫ్లైన్‌ చేస్తుంది అని చెప్పగానే.. ఇందు క్లారిటీగా చెప్తుంది. హర్ష బాగుందని ఇందును మెచ్చుకుని ఇక తమ కంపెనీ నుంచి వచ్చే ప్రతిడీల్‌ మీకే ఇస్తామని చెప్తాడు. హర్ష మాటలకు ఇందు, రాజు సంతోషంగా నవ్వుతుంటారు. రేఖ, భూషణ్‌ మాత్రం షాకింగ్‌గా చూస్తుంటారు.

తర్వాత రేఖ కోపంగా శృతి దగ్గరకు వెళ్లి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఎలాగైనా బెదిరించి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. కానీ రేఖ బెదిరింపులకు శృతి బెదరకపోవడంతో.. బతిమాలి డబ్బు ఆశ చూపించి తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. శృతి, రేఖ ఇస్తానన్న డబ్బులకు కూడా ఆశపడకుండా కోపంగా రేఖకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రేఖ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతా గమనిస్తున్న ఇందు ఎమోషనల్ అవుతూ.. శృతిని మెచ్చుకుంటూ హగ్‌ చేసుకుంటుంది.

Advertisement

చలపతిని వాళ్ల ఓనరు ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అక్కడకు లక్ష్మీతో వెళ్లిన చలపతికి ఓనరు కూతురు ద్వారా వెంకీ సాప్ట్వేర్ జాబ్‌ చేయడం లేదని తెలుస్తుంది. దీంతో చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. ఇంతలో అక్కడకు డెలివరీ తీసుకుని వెంకీ వస్తాడు. అక్కడున్న చలపతి, లక్ష్మీలను చూసి షాక్‌ అవుతాడు. అమ్మానాన్న ఏంటి ఇక్కడు ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అంటూ కంగారు పడుతుంటాడు. ఓనరు డెలివరీ ఇక్కడ ఇవ్వు అని అడగ్గానే.. వెంకీ ముఖానికి మాస్క్‌ పెట్టుకుని వెళ్లి డెలివరీ ఇచ్చి వెళ్లిపోతాడు.

దుగ్గిరాల ఇంట్లో రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ డల్లుగా కూర్చుని ఉంటే.. అప్పుడే శేషు స్వీట్స్‌ తీసుకుని వస్తాడు. ఈ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడానికి తీసుకొచ్చానని చెప్పగానే.. భ్రమరాంబ కోపంగా తిట్టి మనం ఓడిపోయాం అని చెప్పగానే.. అదే మనం పూర్తిగా ఓడిపోయాము అంటూ మీకందరికీ తెలియడానికే ఈ సెలబ్రేషన్‌ అంటూ శేషు చెప్తాడు. దీంతో భ్రమరాంబ, భూషణ్‌, రేఖ కోపంగా చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×