Podarillu Today Episode June 29th : కారేశ్వర్ దగ్గరికి వెళ్లిన చక్రి నీ చూసి అతను ఏంటి నీ పెళ్ళాం నీ కౌగిలిలో కరిగిపోయిందా.? నేను చెప్పిన ఐడియా బాగా వర్క్ అయింది అంటూ తను మాట్లాడడంతో చక్రి చాలా కోపంగా ఉంటాడు. కారేశ్వర్ చూసేలోగా తనని కొట్టడానికి అక్కడ ఉన్న కుర్చీని పట్టుకుంటాడు. అది చూసిన కారేశ్వర్ అరేయ్ ఏంట్రా ఏమైందిరా అని అడుగుతాడు. నిన్ను చంపేస్తాను ఇవ్వాలా నీ వల్లే తను నాకు దూరమైంది ఇంట్లో కూడా లేదు అని బాధపడిపోతారు. మరి ఏం బాధపడకురా ఆ అమ్మాయి మళ్ళీ నీకు దగ్గర అవుతుంది అంటూ కారేశ్వర్ అనడంతో చక్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను తాగేసి వచ్చి అమ్మాయి గదిలోకి వెళ్లడంతో మా ఇంట్లో వాళ్ళు కూడా నాతో మాట్లాడడం లేదు. నాకు యవ్వన భరించాలని లేదు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది అంటూ చక్రి అంటాడు. ఇప్పుడు నీ మీద తనకి ప్రేమ కలిగి ఉంటుందిరా. నువ్వు ఏమి ఆలోచించద్దు కచ్చితంగా తను మళ్ళీ మంచిగా మారుతుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పాడు.
కేశవ మెకానిక్ షాప్ కి వెళ్లి బిజీగా అక్కడ ఉన్న బండిని రిపేర్ చేస్తూ ఉంటాడు.. ఇప్పుడు చోటు శైలు ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటాడు.. సడన్ గా శైలు రావడంతో పార్ట్నర్ వస్తుంది అని అంటాడు.. వస్తే రానివ్వురా పోతే పోనీ అని కేశవ కఠినంగా మాట్లాడుతాడు. అయితే అక్కడికి వచ్చి నా శైలు అరే ముంగిస నేను ఇక నీ దగ్గరికి రాను వెళ్ళిపోతాను అని బాధగా ఉంటుంది.. నేను నువ్వు ఇక ప్రేమ చూపించావు కాబట్టి మా నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటాను. ఇంకెప్పుడు నీకు కనిపించను అని చెప్పడంతో కేశవ ఆలోచిస్తాడు.. నువ్వు వెళ్లిపోవాలి అని అనుకున్న కదా అలానే వెళ్ళిపోతాను అని కేశవ తో శైలు అనేసి వెళ్ళిపోతుంది.. కానీ తన మాట వినగానే… కేశవ చాలా బాధపడిపోతాడు.. తను ఎక్కడ దూరం అయిపోతుందో అని కంగారు పడతాడు..
శైలు వెళ్ళిపోతుందని బాధపడుతున్న కేశవ వెంటనే షర్టు మార్చుకొని పరిగెత్తుకుంటూ శైలు కోసం వెళ్తాడు.. శైలు నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది.. నీ వెనకాల ఏమి రాలేదు నువ్వే నా ముందు వెళ్తున్నావు అని వీళ్ళిద్దరూ కాసేపు రోడ్డుపై గొడవ పడతారు. దూరమవుతున్నావంటే నాకు చాలా బాధగా ఉంది నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను.. నువ్వు నాకు కావాలి అని కేశవ అనడంతో శైలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. నువ్వు నాకోసం ఇంతగా ఆలోచిస్తున్నావంటే అది ప్రేమే అని శైలు నీకు ఇంకా అర్థం కాలేదు.. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకర్థమైంది అని ఒక్కసారిగా కేశవ అని హగ్ చేసుకుంటుంది.. కేశవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇద్దరూ కలిసి ప్రేమలో మునికి తేలుతారు.. ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్గా నిలుస్తుంది..
మహాలక్ష్మి ఆఫీస్ నుంచి హాస్టల్ కి రాగానే అక్కడ టైం అవుతుంది భోజనం చేసి వెళ్దాము అని దివ్య అంటుంది.. అయితే భోజనం ప్లేట్ లో పెట్టుకొని అలా కూర్చుందో లేదో అందరూ ఒక్కసారిగా కార్డులు పట్టుకొని నిలుచుంటారు.. చక్రి చాలా మంచివాడు అతను ఈ కార్డులు ఇచ్చాడు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది.. అంతేకాదు మెస్ లోని ఆంటీ కూడా కార్డు ఇవ్వడంతో మహా ఆలోచనలో పడుతుంది.. ఎటు చూసినా చక్రి సారీ అన్న మాటే వినిపించడంతో మహాలక్ష్మి నన్ను ఎందుకు ఇంతగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య చక్రీ నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అని అనగానే అది లవ్ కాదు అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది.. సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అందుకే ఇన్నిసార్లు సారీ చెప్తున్నాడు అని మహాలక్ష్మి చెప్తుంది..
కన్నా ఒక్కడే ఇంట్లో ఉండడం చేసిన మాధవ్ చక్రి ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. ఏమో అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు నాకు తెలియదు అని కన్నా చెప్పగానే.. చక్రి అప్పుడే ఇంట్లోకి రావడం చూసిన మాధవ్ కేశవ ఇద్దరూ కూడా కన్నకు బాగోలేదని చెప్పిన నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అరిస్తారు.. వాడికి జ్వరం ఎక్కువైంది కదా చూసుకోమని చెప్తే నువ్వు ఇలా వదిలేసి వెళ్తావా అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు అని వాళ్ళిద్దరూ అడుగుతారు. ఇప్పుడు డ్రైవింగ్ కూడా చేయడం లేదు కదా మరి ఎక్కడ తిరిగేసి వస్తున్నారు తమరు అని కేశవ అనడంతో చక్రి చాలా ఫీల్ అవుతాడు. ఒక కన్న మాత్రం వదిన ఉంటే బాగుండేది అని ఎమోషనల్ అవుతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్ళలేకపోయావా అని మహా అడుగుతుంది. అయితే కన్నా మాత్రం మహాని మళ్ళీ ఇంటికి వస్తారా వదిన అని అడుగుతాడు. చక్రి అన్నయ్య నీ దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. తర్వాత రోజు ఉదయం కన్నాని చూడ్డానికి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది.. నారాయణ నాదే తప్పు అని గుంజీలు తీస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…