Virender Sehwag: ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (Ireland vs. Team India) మధ్య నిన్నటి వరకు టి20 సిరీస్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇక రేపటి నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టి20 సిరీస్ (India tour of England, 2026) కూడా ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇంగ్లాండు చేరుకున్న టీమిండియా… టి20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో ముంబై నగరానికి చెందిన ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారని… బీహార్, మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్లను అస్సలు సెలెక్ట్ చేయడం లేదంటూ బాంబు పేల్చారు. బాగా రాణిస్తున్నప్పటికీ ముంబైకి చెందిన వారు కాకపోతే, వాళ్లను టీమ్ ఇండియాలోకి తీసుకోవడం లేదంటూ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశారు. ముంబై ప్లేయర్లు ఎలా ఆడినా, వాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తారని విమర్శలు చేశారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.
15 ఏళ్లకు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (vaibhav Sooryavanshi ) ఐపీఎల్ టోర్నమెంటులో అద్భుతంగా రానించి అంతర్జాతీయ క్రికెట్ కు సెలెక్ట్ అయ్యాడు. అయినప్పటికీ ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు అవకాశం ఇవ్వలేదు టీమిండియా యాజమాన్యం. సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, మహమ్మద్ కైఫ్, లాంటి ఎంతోమంది మాజీ క్రికెటర్లు.. వైభవ్ కు అనుకూలంగా మాట్లాడుతూ… ఐర్లాండ్ తో జరిగిన రెండు టీ20 ల సిరీస్ లో ఆడిస్తే బాగుండు అని సూచనలు చేశారు. అయినప్పటికీ గంభీర్ అండ్ టీం అసలు వినలేదు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో అసలు బీహార్ నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు రావని… సెలెక్ట్ అయినప్పటికీ తుది జట్టులో ఉండడం కష్టమేనని బాంబు పేల్చాడు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగాడు. ఆ మధ్యప్రదేశ్ తరఫున దేశవాలి క్రికెట్ ఆడి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చాడు. 18 సంవత్సరాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ కోసం చాలా పోరాడింది.
కానీ ఎప్పుడైతే రజత్ పాటిదార్ కు (rajat patidar) కెప్టెన్సీ దక్కిందో… అప్పటినుంచి బెంగళూరు జట్టు గాడిలో పడింది. అంతేకాదు ఇతగాడి కెప్టెన్సీ లోనే రెండుసార్లు వరుసగా టైటిల్స్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. మిడిల్ ఓవర్లలో 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో ఇరగదీస్తాడు రజత్ పాటిదార్. స్పిన్నర్లకు నరకం చూపిస్తూ ఉంటాడు. బౌన్సర్లు వస్తే, సిక్సర్లు బాదేస్తాడు. అలాంటి వాడిని కాదని, ముంబై కి సంబంధించిన శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకొని కెప్టెన్ చేశారని వీరేంద్ర సెహ్వాగ్ పరోక్షంగా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు కాబట్టే రజత్ పాటిదార్ కు ఇప్పటికీ టీమిండియాలో అవకాశం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాలో ఉండాలంటే ముంబై వ్యక్తి అయి ఉంటే చాలని… ముంబైలో పుట్టి పెరిగితే ఎవడికైనా ఛాన్స్ దక్కుతుందని ఆయన వెల్లడించారట. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు ఎక్కడన్నారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.