E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజ్

Brahmamudi Serial Today February 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

ధర్మేంద్ర ఇంటి నుంచి వెళ్లిపోతూ.. బిడ్డను ఒకసారి ఎత్తుకోవచ్చా అని కావ్య, తులసిని అడుగుతుంది. దీంతో తులసి బిడ్డను కావ్యకు ఇస్తుంది. బిడ్డను ఎత్తుకున్న కావ్య ఎమోషనల్‌ అవుతుంది. బిడ్డను గుండెలకు హత్తుకుని హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత బిడ్డను తీసుకుని తులసి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌ కోపంగా మినిస్టర్‌ను చూస్తూ.. మేం మీ ఫ్యామిలీ జోలికి రావడం తప్పే… కానీ దీనికి కారణం మీరే. మీ స్వార్ధం కోసం మా బిడ్డను మాకు దూరం చేశారు. అందుకే మీ భార్యకు దగ్గరయ్యాం.. మీ ఆవిడను కలిసినప్పుడే నిజం చెప్పడం మాకు చాలా చిన్న విషయం. కానీ ఆ తల్లిని చూస్తే జాలి వేసింది. నిజం చెప్పి తనని బాధపెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ ఆ నిజం నువ్వే నీ భార్యకు చెప్పాలి. నా భార్య నీకు 15 రోజులు గడువిచ్చింది.. ఆ లోపు నువ్వే మాకు బిడ్డను తిరిగి అప్పగించాలి, లేదంటే జరిగే నష్టం మీకు తెలుసు

అంటూ వార్నింగ్‌ ఇచ్చి కావ్య, రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడే చాటుగా ఉండి అంతా వింటున్న రుద్రాణి వస్తుంది. ఆ రాజ్ గాడు దానిని అంత తేలికగా ఎలా నమ్మాడో అర్ధం కావడం లేదు అంటుంది. దీంతో ధర్మేంద్ర వాడు నమ్మితే నాకేంటి..? నమ్మకపోతే నాకేంటి..?  ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లు మళ్లీ నా గడప తొక్కకూడదు ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ ధర్మేంద్ర అడగ్గానే.. రుద్రాణి ఆలోచిస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తూ.. పాప బారసాల గురించి ఆలోచిస్తుంటారు. ఇంట్లో వాళ్ల మాటలకు రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి దుగ్గిరాల వారి వారసురాలి బారసాల చేయాలి కదా? వచ్చే వారమే ముహూర్తం.. పంతులు గారు చెప్పారు అనగానే.. అపర్ణ కూడా  కూతురి బారసాల అంటే మీ ఇద్దరూ ఏం మాట్లాడరేంటీ..? అంటూ ప్రశ్నిస్తుంది. ఇందిరాదేవి కూడా ఇప్పుడే మీ నాన్నగారికి, బాబాయ్‌కి చెప్పాను. నా ముని మనవరాలి బారసాల అంటే చాలా గొప్పగా చేయాలి. అందుకే పనులన్నీ ఈరోజే మొదలుపెట్టండి అని చెప్పగానే..

Advertisement

రాజ్‌ కల్పించుకుని  పరిస్ధితులు తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు.. డాక్టర్ ఇప్పుడిప్పుడే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు, పాపని అలా చూస్తు బారసాల ఎలా చేస్తాం.. అలాగని  నేను పాపకు బారసాల చేయొద్దు అనడం లేదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే పాప ఆరోగ్యం కుదుటపడ్డాక చేద్దామంటున్నాను అని రాజ్‌ చెప్పగానే.. ఇందిరాదేవి మాత్రం 21వ రోజుకు ఏ బిడ్డకైనా ఊయలలో వేసి, నల్లపూసలు కడితే చీడపీడ తొలగిపోతుంది. అందరి ఆనందోత్సాహాల మధ్య బిడ్డ తన ఒంటినిండా బంగారం పెట్టుకుంటే దాని భవిష్యత్ పండగలా ఉంటుందని చెప్తుంది. దీంతో రాజ్‌ పాప ఆపరేషన్ అయ్యే దాకా.. పాప భవిష్యత్ చెప్పే పరిస్ధితి లేనప్పుడు ఈ బారసాలతో ఆనందం ఎలా వస్తుందని ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య కూడా బారసాల విషయంలో కొద్దిరోజులు ఆగడం మంచిది. పాపకి ఆపరేషన్ అయిపోతుంది.. అప్పుకు కూడా నెలల నిండి తనకు కూడా డెలివరీ అవుతుంది. అప్పుడు ఇద్దరు బిడ్డలకు కలిపి బారసాల చేద్దాం అంటూ కావ్య చెప్పగానే..

కళ్యాణ్‌ కూడా అవును వదిన చెప్పింది కరెక్టే కదా..? ఇంకొన్ని వారాల్లో అప్పూకి డెలివరీ అయిపోతుంది.. అప్పుడు పాపకి కూడా నయం అవుతుంది.. ఇద్దరికీ కలిపి బారసాల గ్రాండ్‌గా చేద్దాం అంటాడు. దీంతో అందరూ సరే అంటారు. బారసాల వాయిదా పడుతుంది. మరోవైపు మినిస్టర్‌ దర్మేంద్రను రుద్రాణి రెచ్చగొడుతుంది. మీ పవరేంటో వాళ్లకు తెలియాలని చెప్తుంది. రెచ్చిపోయిన ధర్మేంద్ర రాజ్‌కు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇస్తాడు. బయటకు వెళ్లిన సుభాష్‌, అపర్ణ, సీతారామయ్య, ఇందిరాదేవి, అప్పు, కళ్యాణ్‌ల కార్లకు యాక్సిడెంట్‌ చేయిస్తాడు. ఆ విషయం తెలిసి రాజ్‌, కావ్య కంగారుపడుతుంటారు. అప్పుడే అందరూ వచ్చి తమ కార్లకు యాక్సిడెంట్‌ అయిందని దేవుడి దయవల్ల తాము సేఫ్‌గా ఉన్నామని చెప్తారు. దీంతో ధాన్యలక్ష్మీ ఒకేసారి మూడు కార్లకు యాక్సిడెంట్‌ అవ్వడం ఏంటి..? అని అనుమానిస్తుంది. అప్పుడే దుగ్గిరాల ఇంటికి ధర్మేంద్ర వస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×